Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో సంచలన వ్యాఖ్యల తో వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తూ కాం గ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణ యించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్నను ఆ పార్టీ శనివారం స స్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువ రించింది.పార్టీకి వ్యతిరేకంగా కార్య క్రమాలకు పాల్పడుతున్న నేపథ్యం లో ఆయనకు సంజాయిషీ కోరు తూ ఇటీవలే కాంగ్రెస్ క్రమశిక్షణా క మిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు తీన్మార్ మల్లన్న నుం చి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వే స్తూ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే చా లా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ స స్పెండ్ చేస్తుందని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపద్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మల్లన్న సస్పెండ్ సబబే: పీసీసీ
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పం దిం చారు. పార్టీ లైన్ దాటితే ఊరుకు నేది లేదని, మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. బీసీ కుల గణన ప్రతులు చించడం పై ఏఐసీసీ సీరియస్ అయింద న్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు చేశారని, పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.