Big Breaking: ప్రజాదీవెన, కర్ణాటక: పొరుగు రా ష్ట్రం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్ర మాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు బలంగా ఢీ కొనడంతో నెలకొన్న ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్య రు. బుధవారం ఉదయం విజయ పుర జిల్లాలో సోలాపూర్ వైపు వె ళ్తున్న మహీంద్ర ఎస్‌యూవీ కారు బసవనబాగేవాడి తాలూకాలోని మనగులి పట్టణం సమీపంలోకి రాగానే అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
దీంతో బస్సు అదుపుతప్పి ఓ కం టైనర్ ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బస్సు డ్రైవర్ కూడా మ రణించాడు.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయా ణికులు కూడా గాయాలపాలయ్యా రు. ప్రమాద సమాచారం అందుకు న్న మనగులి పోలీసులు ఘటనాస్థ లికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపం లోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.