MLC Kavitha suspended: బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ సంచలన ని ర్ణయం, పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
MLC Kavitha suspended : ప్రజాదీవెన,హైదరాబాద్: తెలంగా ణతో పాటు దేశ వ్యాప్తంగా అంద రూ ఊహించినట్టే ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బిఆర్ఎస్ నుంచి బహి ష్కరణకు గురైంది. మాజీ ముఖ్య మంత్రి, బిఆర్ ఎస్ అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ( kcr) తన కూతురు జాగృతి అధ్యక్షురాలు, ఎ మ్మెల్సీ కవితకు సభ్య సమాజం ఊ హించినట్లుగానే షాక్ ఇచ్చారు. గ త కొంతకాలంగా కవిత వ్యవహార శైలిపై పార్టీ అధినేతగా కేసీఆర్ ఆగ్ర హంతో ఉన్నట్లు సమాచారం అం దుతోంది. ఈ క్రమంలో పార్టీలో ట్ర బుల్ షూటర్ గా పేరుగాంచి, కెసి ఆ ర్ కు నమ్మినబంటుగా ఉంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, కెసిఆర్ అంతరంగికుడు సంతోష్ కుమార్ లపై బహిరంగ విమర్శలు చేసిన సందర్భంలో కేసీఆర్ కు కవితపై ఆగ్రహం తారస్థాయికి చేరుకోవ డం తో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
దేశంలో సంచలనం సృష్టించిన లి క్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత ఇటీవలి వ్యవహార శైలి, కొ నసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక లాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చే కూర్చే రీతిలో ఉన్నందున పార్టీ అధి ష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరి గణించిన నేపథ్యంలోనే కవితను త క్షణం పార్టీ నుండి సస్పెండ్ (susp ended) చేస్తూ పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసు కు న్నారని బిఆర్ఎస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాళేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో సోమవారం కవిత మీడియాతో మా ట్లాడుతూ హరీష్, సంతోష్ లపై విమర్శనాస్త్రాలు సంధించిన విష యం తెలిసిందే. కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీశ్ రావు, సం తోష్‌ల అవినీతే ప్రధాన కారణమని ఆరోపించిన విషయం విదితమే. వీ రిద్దరి వెనుక ఉండి కుట్రలు చేస్తు న్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని కూడా ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరితో పాటు గతంలో కేటీఆర్, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి లపై పరోక్ష ఆరోపణలు చేసినందున పార్టీ సీరియస్ గా భావించి కవితపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు తె లుస్తోంది. ఇదిలా ఉండగా తన ఎ మ్మెల్సీ పదవికి రాజీనామా చేయా లని కవిత ఆలోచిస్తున్నట్లు సమా చారం.
*నేడోరేపో అని ముందే ఊహిం చిందే* బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క వితను పార్టీ నుంచి సస్పెండ్ చేయ డం రాజకీయ పరిశీలకులు ముందే ఊహించిందే. ఏదేమైనా ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లే ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం ఓ ప్రకటన వి డుదల చేసింది. కాగా గత కొంత కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బీజేపీలో కల వబోతుందని ఆమె షాకింగ్ కామెం ట్స్ సైతం చేశారు కూడా. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్య లకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నే తలు తరచుగా స్పందిస్తూ వస్తున్న విషయం విదితమే
ఈ క్రమంలోనే సోమవారం కూడా అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ వి ష యాలు వెల్లడించారు. తద్వారా మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై క విత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హ రీష్‌రావులు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వ క నే ఇచ్చారు.
*కవిత నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి…* ప్రస్తుతం బిఆర్ఎస్ వేటు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వ త్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండ గా ఎమ్మె ల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలు స్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి రా జీ నామా చేయాలని కూడా భావిస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం ప్ర కారం తెలుస్తోంది. అదే సమయం లో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్య త్వానికి కూడా రాజీనామా చేయా లని భావిస్తున్నట్లు ప్రచారం విస్తృ తంగా జరుగుతోంది. త్వరలో కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని ఆమె అను చరులు ఇప్పటికే ప్రచారం ప్రారం భించారు. ఈ నేపథ్యంలోనే బుధ వారం నాడు ఎమ్మెల్సీ కవిత మీడి యా ముందుకు వస్తారని, మీడి యా ముఖంగానే భవిష్యత్ కార్యా చరణను ప్రకటించబోతున్నారని ఆమె అనుచరులు కొందరు బహి రంగంగానే వెల్లడిస్తున్నారు.
*కంటిలో నలుసులా కవిత వ్య వహారం* ఇటీవలి కాలంలో కవిత వ్యవహార శైలి బిఆర్ఎస్ పార్టీకి కం టిలో నలుసులా దాపురించిందని, అది నష్టం చేకూర్చే విధంగా ఉం దంటూ బీఆర్ఎస్ అధిష్టానంతో పా టు క్యాడర్ కూడా గుర్రుగా ఉన్న నే పధ్యంలో ఆమెను పార్టీ నుంచి స స్పెండ్ చేయడమే మంచిదన్న భా వించి చివరకు వేటు వేసినట్లు చెబు తున్నారు.
ఈ మేరకు బిఆర్ఎస్ అధిష్టానం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కవిత తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రా థమిక సభ్యత్వానికి రాజీనామా చే యాలని నిర్ణయించుకున్నట్లు స్పష్ట మవుతోంది. అయితే బిఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ తోనే వదిలే యకుండా ఎమ్మెల్సీ పదవిపై బీఆ ర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఆ పదవికి కూడా రాజీనామా చేయా లని కవిత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
*అనుకున్నవిదంగానే కవిత కొ త్త పార్టీ ? …* తాజాగా జరుగుతో న్న పరిణామాల నేపద్యంలో బీఆ ర్ ఎస్ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే యోచనలో కవిత ఉ న్నట్లు ఆమె అనుచరవర్గం చెబుతు న్నారు.లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుం చి పార్టీ పరిధి దాటి వ్యవహరిస్తున్న కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకు న్న ట్లు గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఇప్పటికే జాగృతిని కార్యక లాపాలు పెంచుకుంటూ వస్తున్న కవిత అదే పేరుతో గానీ మరో పేరు తో గానీ కొత్త పార్టీ పెట్టాలని భావి స్తున్నారని సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహా లు కూడా ప్రారంభించారని వినికిడి.
ఎట్టకేలకు బీఆర్ఎస్ నుంచి సస్పె న్షన్ ప్రకటన రావడంతో కొత్త పార్టీ వ్యవహారంలో కవిత కసరత్తు ము మ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.