Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big breaking : బిగ్ బ్రేకింగ్, సుప్రీం ను ఆశ్రయించి న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Big breaking : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టు మెట్లెక్కేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో బిఆర్ ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అన ర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచా రణకు స్వీకరించింది. దానం నాగేం దర్ , కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రా వు ల అనర్హత పిటిషన్లతో కలిపి వి చారిస్తామని సుప్రీంకోర్ట్ ధర్మాసనం వెల్లడించింది.

 

ఏడుగురు ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలన్న పిటి షన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకు ల్ రోహిత్గి కి అందజేయాలని సు ప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చె ప్పాలని గత విచారణలో స్పీకర్ ను సుప్రీంకోర్టు అడిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల అన్హరత పిటి షన్ పై తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది ధర్మాసనం.

 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్ర యించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లు టిఆర్ఎస్ పార్టీ బీఫా మ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి నా ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు లో బిఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.కేసు విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినో ద్ చంద్రన్ ల ధర్మాసనం ఈనెల 10వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.