Big Breaking: ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల గొండ జిల్లా కేంద్రంలో దారుణ హ త్య ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉస్మా న్పుర కాలనీకి చెందిన జడ్పీ స్కూల్ అటెండర్ మహమ్మద్ ఖలీల్ గత నెల 25న మృతి చెందినట్టు గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు నిర్ధారించారు.గుండె పోటు వల్లనే మరణించా డని కట్టుకున్న భార్య బంధువుల తో నమ్మ పలికే ప్రయత్నం చేసింది.
ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు.కేసు న మోదు చేసుకున్న వన్ టౌన్ పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు. ఈ క్రమంలో శుక్రవా రం పోస్ట్ మాస్టమ్ నివేదిక వెలుగు లోకి రావడంతో అందులోని విష యాల ద్వారా కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటికి వచ్చాయి. మృ తుడు మహమ్మద్ ఖలీల్ ది సహజ మరణం కాదని,హత్య చేశారని పి ఎంఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా మృతు ని భార్యను అదుపులో తీసుకున్న నల్లగొండ వన్ టౌన్ పోలీసులు విచారించిన నేపథ్యంలో తానే హ త్య చేసినట్టు అంగీకరించింది.
అ యితే ఈ హత్య ఒకరే చేశారా ఇం కెవరన్నా సహాయం చేశారన్న కో ణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఇదిలా ఉండగా ఈ హత్య ఒకరి వల్ల కాదని బయట వ్యక్తులు కూడా ఇందులో హస్తముందని మృతుని కుటుంబ సభ్యులు ఆరో పిస్తున్నారు. అక్రమ సంబంధం కోస మే హత్య చేసినట్టు కుటుంబల సభ్యులు పేర్కొంటున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
