Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chennai Cardiologist Death : బిగ్ బ్రేకింగ్,చెన్నెలో గుండెవైద్య ని పుణికి గుండెపోటు, కార్డియాక్ సర్జ న్ హఠాన్మరణం

Chennai Cardiologist Death : ప్రజా దీవెన, చెన్నై: ప్రస్తుత సమా జంలో ఏ ఒక్కరికి వారివారి జీవితా ల్లో ఎప్పుడు ప్రతిబంధకాలు ఎదుర వుతాయో అర్థం కాని పరిస్థితి దా పురించింది. ప్రతి మనిషికి చావు ఎ ప్పుడు, ఎలా వస్తుందనేది ఎవరూ ఊహించలేని రోజులు రానే వచ్చా యని తెలుస్తోంది. ఎవరైనా అనా రోగ్యానికి గురై చనిపోతే తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తే బాగుండని అం తా అనుకుంటారు కానీ, ఓ గుండె వైద్యనిపుణుకే అదీ కూడా ఆసుప త్రిలో ఉండగానే ఆపద వస్తే ఎవరూ ఏం చేయలేకపోయారు. ఆస్పత్రిలో ఆన్ డ్యూటీలో ఉండి అప్పటి వర కు వైద్య సేవలు అందించిన ఓ వై ద్యుడు ఒక్కసారిగా కుప్పకూలిపో యాడు. గుండెపోటు వచ్చి హఠా న్మరణం చెందాడు. ఈ విషాద ఘ టన చెన్నెలోని ఓ ఆస్పత్రిలో చో టుచేసుకోగా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.తమిళనాడుకు చెం దిన కార్డియాక్ సర్జన్ డాగ్రాడ్లిన్ రా య్ (39) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది. చెన్నైలోని ప్రై వేటు ఆసుపత్రిలో కార్డియాక్ సర్జ న్గా పనిచేస్తున్న డా. గ్రాడ్లెన్ రాయ్ బుధవారం విధుల్లో భాగంగా ఆసు పత్రి వార్డుల్లో రౌండ్స్ లో ఉండగా ఒ క్కసారిగా గుండెపోటుతో కుప్పకూ లిపోయాడు. అతడిని కాపాడడా నికి సహోద్యోగులు ఎన్ని ప్రయత్నా లు చేసినప్పటికీ ఫలితం లేకపో యిందని, గ్రాడ్లిన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అ ధికారు లు పేర్కొన్నారు.

కార్డియాలజీపై అవగాహన ఉండి

అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునే కార్డియాక్ సర్జన్ గుండె పోటుతో మర ణించడం ఆందోళనకరమైన విషయమని సహచర డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. గ్రాడ్జిన్ రా య్ కు ఎలాంటి అనారోగ్య సమస్య లు కూడా లేవన్నారు. యువతలో హఠాత్తుగా సంభవిస్తున్న గుండెపో టు మరణాలకు ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచే స్తున్నారు.