Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆసియా కప్–2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భా రత జట్టు విజయానికి కీలకంగా ని లిచిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిలక్ వర్మ సీఎం నివాసంలో మ ర్యాదపూర్వకంగా కలిసి అభినంద నలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ తిలక్ వర్మ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అనేకమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నా రు. దేశం గర్వించే ప్రతిభావంతులై న క్రీడాకారులను తెలంగాణ గడ్డ ఎ ల్లప్పుడూ అందిస్తోందని తెలిపారు.
సీఎంను మర్యాదపూర్వకంగా కలి సిన తిలక్ వర్మ, క్రికెట్ బ్యాట్‌ను బ హుమతిగా అందించారు. తిలక్ వ ర్మ కోచ్ సలాం, ఆయన ప్రాక్టీస్ చేసి న గ్రౌండ్ ఇన్చార్జి పృద్వి లను కూడా సీఎం అభినందించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర క్రీడలు, యువజన సేవల మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేనా రె డ్డి, ఎండీ డాక్టర్ సోనిబాల దేవి, సీ ఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరా జు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు శ్రీ రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.
AsiaCup key hero thilak Sharma meet with CM Revanth Reddy pic.twitter.com/FIrytdcf3r
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 30, 2025