Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Orders : బిగ్ బ్రేకింగ్, గుల్జార్​హౌజ్​ అగ్ని ప్ర మాదంపై విచారణకు సీఎం రేవం త్ ఆదేశం

CM Revanth Orders :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్​హౌజ్​లో జరిగిన భారీ అగ్ని ప్రమా దంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్ర మాదానికి దారి తీసిన అసలైన కా రణాలను లోతుగా దర్యాప్తు చే యాలని ఆదేశించారు. భవిష్యత్తు లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుం డా నివారణ చర్యలను చేపట్టాల ని, ప్రజలను అప్రమత్తం చేయాల్సి న అవసరం ఉందని అన్నారు.

మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల ము ఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రక టించారు. వారి కుటుంబాలకు సా నుభూతి ప్రకటించారు. బాధిత కు టుంబాలను ప్రభుత్వం ఆదుకుం టుందని భరోసా ఇచ్చారు. ప్రమా దం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్ని మాపక శాఖ, పోలీసు అధికారు లతో ఎప్పటికప్పుడు ఫోన్​లో మా ట్లాడి సహాయక చర్యలను పర్య వేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బా ధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెం టనే ఘటన స్థలానికి వెళ్లాలని సీ ఎం ఆదేశించారు.

సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఐజీ నాగిరెడ్డితో ఫోన్ లో మాట్లాడి గాయపడిన వా రికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆ దేశాలు జారీ చేశారు. అక్కడున్న బాధిత కుటుంబీకులతో కూడా ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని వారి కి భరోసా ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్ర భుత్వం తరఫున 5 లక్షల రూ పా యల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రక టించారు. ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. మంటల్లో చిక్కుకున్న వా రిని కాపాడేందుకు ఫైర్​ టీమ్​ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు.