Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 10:53 am Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి అ ప్పీల్, సన్నబియ్యం పంపిణీని సర్వ త్రా అమలుచేయండి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. తెలంగాణలో మాదిరిగా దే శంలోని అన్ని ప్రాంతాల్లో సన్నబి య్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కో రారు. గురువారం హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర వినియోగదారుల వ్య వహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు హాజర య్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ ప్రజలు తినేబియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరు తుందని చెప్పారు. తెలంగాణ మా దిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని కో రారు.అవసరమైతే దీనిపై అధ్య యనం చేసి తగిన నిర్ణయం తీసుకో వాలన్నారు. పూర్తిస్థాయి అధ్యయ నం తరువాత పరిశీలించి దేశ వ్యా ప్తంగా సన్న బియ్యం పంపిణీ అం శంపై నిర్ణయం తీసుకుం టామని సీఎం రేవంత్ రెడ్డికి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సర ఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషా ద్రి, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.