Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 1:35 pm Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు ముహూ ర్తం ఖరారు, 6రోజులు 6జిల్లాల్లో టూర్ కు సన్నద్ధం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి జిల్లాల పర్యటనకు ము హూర్తం ఖరారైంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా పర్యట నకు అధికారికంగా టూర్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో పంచాయతీ ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లాల ప ర్యటనకు సీఎం రేవంత్ సిద్ధమ య్యారు. ఈ మేరకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమం త్రి కార్యాలయం విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్ కొనసాగనుందని, ఆరు రోజు లు ఆరు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రంగం సిద్ధమైంది. అధి కారిక సీఎం రేవంత్ పర్యటన షె డ్యూల్ ప్రకారం డిసెంబర్ 1వ తేదీ న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో పర్యటనతో ప్రారంభమయ్యే సీ ఎం టూర్ డిసెంబర్ 2న ఖమ్మం జి ల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3వ తేదీ న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్,

డిసెంబర్ 4న ఆదిలాబాద్, డిసెం బర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్లగొండ జిల్లా దేవరకొండలలో

పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా వి స్తృత పర్యటనలకు ఓ వైపు ప్రభు త్వం, అదే సందర్భంలో కాంగ్రెస్ పా ర్టీ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చే సేందుకు కసరత్తు ప్రారంబించారు.

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో పంచాయతీ ఎ న్నికలు జరగనున్న సంగతి తెలిసిం దే. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడు దల చేసింది. మొదటి విడత వచ్చే నెల డిసెంబర్ 11, రెండో విడత డి సెంబర్ 14, మూడో విడత డిసెం బ ర్ 17వ తేదీన ఉంటుంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేప ట్టనున్నారని తెలుస్తోంది. తాజాగా, సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రక టనతో కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉ త్సాహం నెలకొంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.