Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 3:19 pm Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీల క ఆదేశం, వందనియోజకవర్గాల్లో ప‌బ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలి

–పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియో జ‌క‌వ‌ర్గంలో ఒక‌టి

–ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం

–క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తు ల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం

–99 రోజులపోగ్రాంలో వారంరోజు లు పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో కార్యక్ర‌ మాలు

–ఏఐ సాంకేతిక‌పై ఉపాధ్యాయు లు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌

— ప్రాథ‌మిక నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు బ్రేక్‌ఫాస్ట్

–విశ్వవిద్యాల‌యాల‌కు నిధులపై నివేదిక స‌మ‌ర్పించండి

–విద్యాశాఖపై స‌మీక్ష‌లో ముఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌ క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వె లుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ ను ఈ ఏడాది నుంచి ప్రారంభించా ల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీ డా మైదానం, ఇత‌ర అన్నిర‌కాల వ‌ స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వా ణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆ రుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌ హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌ పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ము ఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువా రం స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌ మైన విద్య‌కు చిరునామాగా తెలం గాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు.

ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వె ను కాడేది లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శా ల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌ హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీ ర్ల‌ను ఆదేశించారు. వీటి నిర్మాణం లో ఆధునిక సాంకేతిక‌త‌ను విని యోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని సీఎం ఆ దేశించారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండా ల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అ ప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌ లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌ తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శా ల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌ కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌ భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌ తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తె లుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

కృత్రిమ మేథ (AI) ప్ర‌పంచాన్ని శా సిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థా యి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌ మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రే వంత్ రెడ్డి ఆదేశించారు. మారుతు న్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చు కు నేలా ఏఐపై ఉపాధ్యాయులు, లె క్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌ తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశిం చారు. AIతో ప్రపంచ వ్యాప్తంగా వ‌ చ్చే మార్పుల‌ను తెలుసుకొని దాని ద్వారా వ‌చ్చే అవ‌కాశాలు మ‌న వి ద్యార్థులే అందిపుచ్చుకునేలా మ‌ న స‌న్న‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం అభి ప్రాయ‌ప‌డ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మై న మార్పుల‌ను తీసుకురావాల‌ని సీఎం పేర్కొన్నారు.

2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చే యాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రేక్ ఫాస్ట్ అంద‌ జేత‌కు సంబంధించి అధికారులు, హ‌రేకృష్ణ‌మిష‌న్ ప్ర‌తినిధుల‌కు సీ ఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. బ్రేక్‌ ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పా లు అంద‌జేయాల‌ని, ఇందుకు పా ల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌ రించాల‌ని సీఎం ఆదేశించారు. వి ద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అం ద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేం దుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విని యోగించాల‌ని ముఖ్య‌మంత్రి సూ చించారు.

పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయా ల‌ని అందులో స్కూల్ బ్యాగ్‌, పె న్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగు ల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డి క్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాల‌ ని సీఎం తెలిపారు. ఇందుకు సం బంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చేలా చూడాల‌ని అధికా రుల‌ను సీఎం ఆదేశించారు. పాలి టెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంట‌నే ప్రారం భించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదే శించారు.

కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గిం చాల‌న్నారు.పాలిటె క్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంట‌ నే వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌ కాశాలు ల‌భించేలా చూడాల‌ని సీ ఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అ న్ని విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సి టీకి రూ.1000 కోట్లు కేటాయించి న విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు. మిగ‌తా యూని వ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌ మ‌నే దానిపై నివే దిక స‌మ‌ర్పించాల‌ని ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజుల ని యంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగా ణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యు ల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎదుట ఉం చింది. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉ న్న విధానాలు, తెలంగాణ‌లో తీ సుకోవాల్సిన అంశాల‌ను వివ‌రిం చారు. సావ‌ధానంగా విన్న ముఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా స్థాయి లో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌ న్నారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయి లోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలి పారు.

అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సం బం ధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభి ప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలం గాణ విద్యా విధానంపై తాము రూ పొందించిన నివేదిక‌ను తెలంగాణ విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి, స‌భ్యులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి స‌మ‌ర్పించారు. అ మెరికా, వియ‌త్నాం, మ‌లేసియా దే శాల్లో స్వ‌యంగా ప‌ర్య‌టించ‌డంతో పాటు వివిధ దేశాలు, ప‌లు రాష్ట్రా ల్లోని అత్యుత్త‌మ విధానాల‌ను ప‌రి శీలించి నివేదిక రూపొందించిన‌ట్లు విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు సీఎంకు తెలియజేశారు. నివేదిక‌ లోని ఒక్కో అంశంపై ఛైర్మ‌న్ ముర‌ ళి సుదీర్ఘంగా వివ‌రించారు. సావ‌ ధానంగా ఆల‌కించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయా అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం నివేదిక‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అంశాలు… వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌ద‌గిన అంశాల‌పై నివేదిక రూ పొందించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ స‌ ల‌హాదారు డాక్ట‌ర్ కేశ‌వ‌రావు నేతృ త్వంలోని క‌మిటీకి ముఖ్య‌మంత్రి అప్ప‌గించారు. స‌మావేశంలో ము ఖ్య‌మంత్రి సలహాదారు వేం నరేం దర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు డాక్ట‌ర్ కేశవరావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కా ర్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిష న్ ఛైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్న త విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ కార్య దర్శిగా యోగితారాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు డైరెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ ద‌ర్శి వెంక‌టేష్ ధోత్రే, పాఠ‌శాల వి ద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికొల‌స్‌, స‌మ‌గ్ర శిక్ష నోడ‌ల్ ఆఫీస‌ర్‌, డి.నాగ‌ రాజు, ఉస్మానియా విశ్వ విద్యా ల‌ యం వీసీ ప్రొఫెస‌ర్ మొలుగారం కు మార్‌, డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓ పెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యా క‌మిష‌న్ స‌భ్యులు ప్రొఫెసర్ పీ.ఎల్‌.విశ్వేశ్వ‌ ర‌రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టే ష్, జ్యోత్స్న శివారెడ్డి, ప్రొఫెస‌ర్ ప‌ ద్మ‌జాషా, కార్తీక్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, వీ ర వాస‌వి, డాక్ట‌ర్ జెన్న‌త్‌ఫ‌ర్ అజ్మీ స‌య్య‌ద్‌, డాక్ట‌ర్ ఎన్‌.వెంక‌టేష్‌, షే క్ జావేద్ అఫ్రోజ్‌, డాక్ట‌ర్ జే.స్వ‌ప్న‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.