CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, రవాణాశాఖ చెక్ పోస్టు లన్నింటినీ తక్షణం మూసివేయాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ దేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ డీటీఓలకు ఆదేశాలు విడుదల చే శారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవా ణా అధికారులు (డీటీఓ) స్వయం గా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పో స్టులు మూసి వేయబడినట్టుగా కొ త్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసం హరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచి స్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను త క్షణం తొలగించాలని డీటీఓలకు ఆ దేశాలు జారీ చేశారు. ఈ తొలగిం పు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పారు.
చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూట ర్లు, ఇతర వస్తువులను తక్షణం డీ టీఓ కార్యాలయాలకు తరలించా లని, అలాగే పరిపాలనకు సంబం ధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రి సిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీ టీవో కార్యాలయంలో భద్రపరచాల ని ఆదేశించారు.
ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహిం చిన స్థలాల్లో వాహనాల రాకపో కలకు ఎలాంటి అడ్డంకులు లేకుం డా అవసరమైన చర్యలు తీసుకో వాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సి బ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికా ర్డులను భద్రపరిచిన విషయాలన్నిం టిపైనా ఈరోజు సాయంత్రం 5 గంట లలోపు నివేదిక అందించాలని డీటీ ఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.