Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్యచేరి గణనాథుల నిమ జ్జనoలో సీఎం రేవంత్ రెడ్డి, సదా సీదా పర్యటన 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి ఎలాంటి హంగూ ఆ ర్భాటం లేకుండా, కట్టుదిట్టమైన భ ద్రత బలగాలు లేకుండా సాధారణ సిబ్బందితో హైదరాబాద్ గణనాధు ని నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యక్ష మయ్యారు. ఎప్పుడూ ఉండే భద్ర తా సిబ్బంది కూడా లేకుండా ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక సా మాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కా ర్యక్రమాన్ని పరిశీలించారు.

ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లే కుండా పరిమిత సంఖ్యలో వాహ నాలతో సాదాసీదాగా నలుగు రైదు గురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి గారు అక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల మధ్య చేరి పోయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గణపతి బొప్పా మోరియా అంటూ పెద్ద ఎత్తున భక్తుల నినాదాలు మా రుమోగుతున్న వేళ ముందస్తు స మాచారం లేకుండా సాదాసీదాగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కి అశేషంగా తరలివచ్చిన భక్తులకు అభివాదం చేశారు.

అదే క్రమంలో క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీ లించారు. ఉదయం నుంచే శో భా యాత్ర ప్రారంభమై ఒక్కొక్కటిగా గ ణపతులు ట్యాంక్‌బండ్ తరులు తుండగా, సాయంత్రానికి మహా గణపతి శోభాయాత్ర ఊపందుకుం ది. ఆ సమయంలో ఒక సాధారణ వ్యక్తిలా ముఖ్యమంత్రి ఆ మహా జ నంలో కలిసిపోయి ఏర్పాట్లను పరి శీలించారు. భక్తులతో కరచాలనం చేస్తూ ముందుకు నడిచారు.

హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ (పీవీ మా ర్గ్) లో నిరాటంకంగా సాగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొన్న సిబ్బందిని అభినందించా రు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని చె ప్పారు.