District Collector Tejas Nandlal Pawar : బిగ్ బ్రేకింగ్, మునగాల తహసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక త నిఖీ, ఉద్యోగుల సస్పెండ్
District Collector Tejas Nandlal Pawar :
ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారుల పనితీరు ను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువా రం మునగాల తహసీల్దార్ కార్యా లయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అప్పటికే ఉదయం 11 గంటల సమయం దాటినా సగానికి పైగా రె వెన్యూ అధికారులు ఆఫీసుకు రాక పోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. మీ ఆఫీసులో సిబ్బంది సమయపాలన పాటించరా అంటూ తహసీల్దార్ ను ప్రశ్నించారు.వెంటనే విధులకు గైర్హాజరు అయిన సిబ్బం దిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే కార్యాలయ సిబ్బంది గైర్హా జరుపై వివరణ ఇవ్వాలని తహసీ ల్దార్ ను కోరారు. కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సిబ్బంది హాజరు రిజి స్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా అధి కారుల్లో గుబులు పుట్టిస్తోంది. ము ఖ్యంగా ఇస్టానూసారంగా విధులకు హాజరవులున్న అధికారుల వెన్ను ల్లో వణుకు తెప్పిస్తోంది.
ప్రస్తుతం మునగాల తహసీల్దార్ ఆఫీసులో సగానికి పైగా సిబ్బంది సస్పెండ్ కావడం సూర్యాపేట జి ల్లాలో సంచలనంగా మారింది. మ రోవైపు కలెక్టర్ చర్యలపై జిల్లా ప్రజ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.