Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి అ ల్టిమేటం, విద్యుత్ స్తంభాలపై కేబు ల్ వైర్లను తక్షణమే తొలగించండి
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రా ణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం, వి ద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారు లను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాల యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థి తులను దృష్టిలో పెట్టుకొని డిప్యూ టీ సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
మానవీయ కోణంలో ఆలోచించి కే బుల్ వైర్లను తొలగించాలని గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేట ర్లకు పలుమార్లు నోటీసులు జారీ చే శామని, కావలసిన సమయం ఇచ్చి నా వారు స్పందించకపోవడంతో ప్ర జల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చే శారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షిం చేది లేదని యావత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబు ల్ వైర్లను తొలగించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వి ద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసు కుం టే అధికారులు, సిబ్బంది వెంటనే క ఠినంగా స్పందించాలని వాటిని తొ లగించాలని ఆదేశించారు. రాష్ట్రం లో ఎక్కడైనా విద్యుత్ కనక్షన్ తీసు కునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవా లని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్య క్తుల ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఏ ర్పాటు చేసుకోవడం మూలంగా ప్రా ణాలకు ముప్పు ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో అండ ర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అ ధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశిం చారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబు ల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెం ట్ సమర్పించిన డిపిఆర్ (డీటెయి ల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పై సమావేశంలో చర్చించారు.
సాగునీరు సమృద్ధిగా అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో వివిధ ఎ త్తిపోతల పథకాల కింద విద్యుత్ స రఫరా, వినియోగం పై సమీక్ష సమా వేశం నిర్వహించారు.
సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సి పల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రా న్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, జెన్కో సిఎండి. హరీష్, ఎస్పీడీసీఎల్ సి ఎండి ముషారఫ్ ఫారుకి, ఎన్పీడీ సీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.