Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DGP Shivadhar Reddy : బిగ్ బ్రేకింగ్, డీజీపీ శివధర్ రెడ్డి కీల క వ్యాఖ్య, తెలంగాణలో పింక్ బు క్, రెడ్ బుక్, బ్లూబుక్ లులేవు, మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే

DGP Shivadhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పింకు బుక్, రెడ్ బు క్, బ్లూ బుక్ లంటూ ఏమీ లేవని మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మా త్రమేనని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవా రం తెలంగాణ నూతన డీజీపీగా బా ధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్న కు సమానంగా ఈ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యుల ను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సుస్పష్టం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. డీజీపీ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలి పారు. ఏ లక్ష్యంతో నన్ను నియ మించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబో తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మా కు మొదటి చాలెంజ్ గా భావి స్తా మని, శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో 17000 ఖాళీలు ఉ న్నా యని, ఆ నియామకాలు పూర్తి అ య్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థ వంతంగా పని చేస్తామని, మావో యిస్టులు పొలిట్ బ్యూరో మల్లోజు ల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రక టన రిలీజ్ చేశారని, బయటకు రా వడానికి, ఆయుదాలు వదిలి పెట్ట డానికి నిర్ణయం తీసుకున్నామని ప్ర కటన రిలీజ్ చేశారని గుర్తు చేశారు.
జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్న పుడే ఆ నిర్ణయం జరిగిందని వే ణు గోపాల్ ప్రకటనలో పేర్కొన్నార న్నారు.

అదే సందర్భంలో వేణుగోపాల్ ఇ చ్చిన స్టేట్ మెంట్ జగన్ ఖండించా రని, ప్రజా పోరాట పంథా సక్సెస్ అ వట్లేదని మావోయిస్టులే అంటున్నా రని, పోలీసులు వేధిస్తారని అని భ యం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జన జీవన స్రవంతి లోకి రావాలని విజ్ఞప్తి చేస్తు న్నామని పిలుపునిచ్చారు.చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయ టకు వస్తున్నారని, రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క కూడా లొంగిపోయారన్నారు. మావో యి స్టులతో మాకు ఇక్కడ సమస్య లే నపుడు వాళ్ళతో చర్చలు అనవస రమని స్పష్టం చేశారు.

సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.
బేసిక్ పోలింగ్, విజువల్ పో లీ సింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తామని పునరుద్ఘాటించారు.