Politicsతెలంగాణనల్గొండ

District Collector Chandrashekhar : బిగ్ బ్రేకింగ్, జిల్లా కలెక్టర్ చంద్ర శేఖ ర్ స్పష్టీకరణ, ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను క్షుణ్ణం గా పరిశీలించి పరిష్కరిస్తాం 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురిం చిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షు ణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవా రం అయన కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో మున్సిపల్ ఎ న్నికల ముసాయిదా ఓటరు జాబి తాపై అఖిలపక్ష సమావేశం నిర్వ హించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలి టీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై 825 అభ్యంత రాలు వచ్చాయని, ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డు లో రావడం, కుటుంబ సభ్యులకు వేరువేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు రెండు మూడు పోలింగ్ కేంద్రాలలో ఉండ డం వంటి వాటిపై ఎక్కువగా అ భ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు.

వార్డువారిగా ప్రచురించిన ఓటరు జాబితా పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చి పునః పరిశీలన చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అ యన తెలియజేశారు. వీటన్నిటిని ఈ నెల 9 లోపు పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని,అంతలోపు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజ కీయ పార్టీలు తెలియజేయాలని కో రారు.

అక్టోబర్ 1, 2025 ఆధారంగా ఓట రు జాబితాలో అప్డేట్ అయిన వాటి ని మాత్రమే పరిగణనలోకి తీసుకో వడం జరుగుతుందని, దీని ద్వా రా నే తుది జాబితా ప్రచురించడం జ రుగుతుందని వెల్లడించారు. ఏలాం టి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించి మున్సిపల్ ఎన్నికల కు సిద్ధంగా ఉండడానికి అన్ని చర్య లు తీసుకుంటున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరిం చాలని ఆయన కోరారు.

అంతకుముందు స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపుకలెక్టర్ వై.అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 1న మున్సి పాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగింద ని, అభ్యంతరాల స్వీకరణకై మున్సి పాలిటీలలో హెల్ప్ డెస్క్ తో పాటు, కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేయ డం జరిగిందని, అభ్యంతరాలు స్వీ కరించడం జరిగిందని తెలిపారు .

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు మాట్లాడుతూ తుది ఓటరు జా బితా ప్రకటించే ముందే వార్డు హ ద్దులను నిర్ణయించాలని, కొత్తగా ఇంటి నంబర్లు వచ్చిన చోట ఓటరు జాబితాలో టాలీ కావడం లేదని, ఒ క ఇంట్లో ఓట్లు వేరే వేరే వార్డులకు వెళ్లడం జరిగిందని, అలాగే డబుల్ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని, మున్సిపల్ ఎన్నిక లపై అన్ని రాజకీయ పార్టీల ప్రతిని ధులకు ఎప్పటికప్పుడు సమాచా రం అందించాలని,ముసాయిదా జా బితా ముందే అన్ని రాజకీయ పార్టీ లకు ఇవ్వాలని, అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని, అలాంటివి తొలగించా లని కోరారు.

జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 ఓట్లకు మించి ఎక్కువ ఓటర్లు ఉన్నచోట్ల అదే లొ కాలిటీలో మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుం ద ని, అక్టోబర్ 1, 2025 ఆధారంగా బి ఎల్ఓ ల ద్వారా ఫామ్ 7,8 లో తీ సుకున్న వివరాల ఆధారంగా ఓటర్ల అప్ డేషన్ ఉంటుందని తెలిపారు. నేష నల్ కాంగ్రెస్ నుండి నర్సింహా రావు, బిఆర్ఎస్ నుండి పిచ్చయ్య, బిజెపి నుండి లింగస్వామి, ఎంఐ ఎం నుండి మహమ్మద్ రజియుద్ది న్, టిడిపి నుండి రాజశేఖర్ రెడ్డి లు మాట్లాడారు.ఈ సమా వేశంలో సిపి ఎం నుండి నర్సిరెడ్డి, మున్సిపల్ క మిషనర్లు తదితరులు హాజరయ్యా రు.

Related Articles

Back to top button