Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 1:41 pm Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సీఎం రే వంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం,హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలపై బిజెపి నాయకుల నిరసన 

Big Breaking : ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర ము ఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ పై అను చిత వ్యాఖ్యలు చేసినందుకు నిరస నగా బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ము ఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ రాష్ట్రంలో హిందువులను హిందూ దేవుళ్ళను అడుగడుగున అవమానిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభు త్వానికి నాయకులకి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఒక వ ర్గం మెప్పు కోసం మైనారిటీల ఓట్ల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హో దాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి హిం దూ మనోభావాల దెబ్బతీసే విధం గా మాట్లాడడం చాలా బాధాకర మని ధ్వజమెత్తారు. నల్లగొండ జి ల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక వర్గానికి మేలు చేయడం కోసం హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఆరో పించారు.

హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి ము స్లింలకు అనుకూలంగా మాట్లా డతారు ఎంఐఎం పార్టీకు తొత్తులు గా ఓవైసీ బ్రదర్స్ వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం వారి మెప్పుకోసం పనిచే స్తుంది వారి మెప్పుకోసం హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని, ఎక్కడికక్కడ అడ్డుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాక్యాల కు బేషరతుగా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కా ర్యదర్శి కంచర్ల విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మాజీ కౌ న్సిలర్ కంకణాల నాగిరెడ్డి, జిల్లా కౌ న్సిల్ మెంబర్ బిపంగి జగ్జీవన్ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీధ ర్, మంగినపల్లి కిషన్, దాసరి కృష్ణ బిపంగి వినోద్, ఏరుకొండ హరి చిం త శివరామకృష్ణ, నరసింహ, పుల్లెం ల శ్యామ్ యానాల శ్రీనివాస్ రెడ్డి, డా. అరవింద్ రెడ్డి, దుబ్బాక సాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు.