Kaleshwaram water : బిగ్ బ్రేకింగ్, రోడెక్కిన రైతులు, కాళే శ్వరం నీళ్లు తుంగతుర్తికి ఇవ్వాలని డిమాండ్
Kaleshwaram water :ప్రజా దీవెన, తుంగతుర్తి: కాళేశ్వరం వద్ద కన్నెపల్లి మోటార్లను నడిపి పా రుతున్న గోదావరి నీళ్లను ఎస్సారె స్పీ కాలువల ద్వారా తుంగతుర్తి ప్రాంత రైతులకు ఇబ్బంది కలగకుం డా పంట పొలాలకు అందించాలని బిఆర్ఎస్ తుంగతుర్తి మండల పా ర్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. సోమవారం తుం గతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాస్తారోకో ధర్నా నిర్వ హించారు. అనంతరం ఆయన మీ డియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదే శ్ లో గోదావరి నది పై అక్రమంగా ని ర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను వెం టనే ఆపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు చర్యలు చేపట్టి కృష్ణ.. గో దావరి, జలాల్లో తెలంగాణ వాటా ను కాపాడాలన్నారు.
తుంగతుర్తి ప్రాంతంలో సకాలంలో సరియైన వర్షాలు కురువకపోవడం తో చెరువులు, కుంటలు పూర్తిగా నిండనందున భూగర్భజలాలు అ డుగంటిపోయి రైతంగo ఇబ్బందు లకు గురవుతున్నారన్నారు. రైతు లు అ ప్పులపాలయ్యారని కాంగ్రెస్ మాట లు నమ్మి మోసం జరిగిందని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నార ని అన్నారు.
ముఖ్యమంత్రి ఎన్ని ఉపాయాలు ప న్నిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అ న్నారు. అందుకే రానున్న స్థానిక ఎ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన బుద్ధి చెప్పి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలి పించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయ కులు దొంగరి శ్రీనివాస్, తునికి సా యిలు, కడారి దాసు, మట్టిపెల్లి వెం కట్, గోపగాని రమేష్, దూదిగాని లింగయ్య, బర్ల సోమన్న, గాజుల యాదగిరి,. బూక్య ధర్మ, యాకూ నాయక్. దశరద నాయక్, పూర్ణ నా యక్, కొండగడుపుల నాగ య్య, తునికి లక్ష్మి , బోయిని భాస్కర్. గో పగాని వెంకన్న శంకర్ నాయక్. క ళ్యాణ్, పోలేపాక పరమేష్. కేశవ రెడ్డి, తూం బిక్షం. అకారపు భాస్క ర్, జటంగి రవి, వెంకట్ నర్సు చిం తకుంట్ల సురేష్. మనోజ్. షేక్ జూ నీ తో పాటు అన్ని గ్రామాల నాయ కులు. కార్యకర్తలు పాల్గొన్నారు.