Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 9:28 am Posted by : praja deveena

Panchayat Election Counting : బిగ్ బ్రేకింగ్, ముగిసిన తొలి విడత పంచాయతీ భారీ పోలింగ్, కౌంటిం గ్ ప్రారంభం

Panchayat Election Counting : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మొదటి విడత పం చాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడ క్కడ స్వల్ప ఘర్షణలు మినహా ప్ర శాంతంగా ముగిసింది. ఎన్నికల క మిషన్ నియమావళి మేరకు పోలిం గ్ సమయం అధికారికంగా ముగిసి నప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఇం కా కొన్ని గ్రామాల్లో భారీగా ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం మధ్యాహ్నం 1 గంటలోపు క్యూలో నిలబడి ఉ న్నవారికి ఓటు వేసే అవకాశం క ల్పించేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. లోపల ఉన్నవారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రా రంభం కాగా ప్రజలు క్యూలైన్లలో ని లబడి తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. 1 గంట లోపు పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకున్న వా రి కి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగగా మొత్తం 12,69 0 మంది సర్పంచ్ అభ్యర్థులు బరి లో ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ పూ ర్తి కాగా భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. మొదట వార్డు. సర్పంచ్ ఓట్లను వేరు చేసి అనంతరం వా ర్డు ల ఓట్లను లెక్కించి ఒక్కొక్కటిగా ఫ లితాలను వెల్లడించనున్నారు అధి కారులు.

*సాధారణ ఎన్నికల తరహాలో స ర్పంచ్ ఎన్నికల్లో ధనప్రవాహం*

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పల్లెజనం సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లు వేశారు. పలుచోట్ల అభ్యర్థులే ప్రత్యే కంగా నగరానికి వాహనాలను పం పించి ఓటర్లను గ్రామాలకు పెద్ద ఎత్తున తరలించారు. అదే సంద ర్భంలో వారికి తగిన మొత్తంలో నగ దును సైతం పంపిణీ చేశారు.

కాగా మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వా రా ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. కాగా దా రులన్నీ ఊళ్లవైపు మళ్లడంతో సిటీ శివార్లలో భారీగా ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఉమ్మడి నల్లగొండ, ఖ మ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు భారీగా తరలి వెళ్ల డంతో ఎల్పీనగర్, చౌటుప్పల్ ప్రాం తాల్లో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. మరోవైపు ఆర్టీసీ బస్సు లు, ప్రైవేటు వాహనాలు సైతం జ నంతో కిక్కిరిసిపోవడం గమనార్హం

*అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు….* నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఉరు మడ్ల గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కాం గ్రెస్ నేత, రాష్ట్ర డెయిరీ కార్పొ రేష న్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఓ ద శ లో ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేం దుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని వారించడంతో ప రిస్థితిని సద్దుమణిగింది. అలాగే కే తేపల్లి మండల పరిధిలోని కొర్లప హాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్త లు పరస్పర దాడులకు పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. ఇక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం 11వ నెంబర్ పోలింగ్ బూత్ లో దొంగఓటు కలకలం రేపింది. తన ఓ టు ఎవరో వేశారంటూ కోటగిరి ల క్ష్మి అనే మహిళ ఆందోళనకు దిగిం ది. పోలింగ్ వచ్చేసరికే ఆమె ఓటు అప్పటికే పోల్ అయిందని అధికా రులు తెలపడంతో షాక్ కు గురైంది. తన ఓటు వేరొకరు వేయడం ఏంట ని నిలదీయడంతో అధికారులు స దరు మహిళతో టెండర్ ఓటును వే యించారు. భారత ఎన్నికల సం ఘం 1961లో సెక్షన్ 49(పి) ప్ర కా రం ఒకరి ఓటు మరొకరు వేసినట్టు రుజువైతే అసలు ఓటరుకు ఓటు వే సే అవకాశం కల్పిస్తారు. సాధారణ బ్యాలెట్ పేపర్ బండల్లోని చివరి బ్యాలెట్ ను ఇచ్చి ఓటు వేయడా ని కి అనుమతించడం అనవాయితీ.

అదే విధంగా రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం ఎక్లాస్భన్పేట్ గ్రామం లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామం ఎక్లాస్భన్పేట్ లో ఎమ్మె ల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరు లు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తు న్నారనే ఆరోపణలు రావడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వారి పై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్సీ అనుచరుల కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు బాధ్యుల ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇరు వర్గా లపై కేసులు నమోదయ్యాయి.