Yadadri Thermal Power Station : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ జాతికి అంకితం, పాల్గొన్న నలుగురు మంత్రులు
Yadadri Thermal Power Station : ప్రజా దీవెన, మిర్యా లగూడ: ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి యా దాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని అ న్ని యూనిట్లను పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో వి ద్యుత్ అందించేందుకు చర్యలు తీ సుకుంటామ ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇందు కుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పని చేయాలని ఆయన అధికా రులను ఆదేశించారు. ఇదివరకే రూ పొందించిన క్యాలెండర్ ను తూ.చా తప్పకుండా పాటించాలన్నారు. శు క్రవారం ఆయన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి న ల్గొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 80 0 మెగావాట్ల వి ద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్ -1 లోని ఒకటవ యూనిట్ జాతికి అం కితం చేశారు. అంతేకాక 970 కోట్ల రూపాయ లతో వైటిపిఎస్ ఆవరణ లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షి ప్ ప నులకు శంకుస్థాపన చేశారు. అలాగే వనమహోత్సవం కింద మొ క్కలు నాటారు.అనంతరం వైటిపి ఎస్ సమావేశ మందిరంలో నిర్వ హించిన సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
నిర్దేశించిన సమయంలోగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందిం చేందుకు వైటిపీఎస్ అధికారులు ప నులను ప్రాధాన్యత క్రమంలో విభ జించు కోవాలన్నారు. సంవత్సర కా లంలోనే స్టేజ్ వన్ లోని రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల ఆయన వైటీపీ ఎస్ అధికారులు, సిబ్బందిని అభి నందించారు.డిసెంబర్ లో గా అన్ని యూనిట్లను పూర్తి చే సి జనవరి 1 ,2026 నుండి పూర్తి స్థాయిలో వి ద్యుత్ అందించేలా సమయాన్ని, అన్ని జాగ్రత్తలు పా టిస్తూ పని చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రోటోకా ల్ ను పాటించాలని అంతేకాక యా దాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు బాగున్నా యనే విధంగా అభివృద్ధి చేయాలని అంతర్జా తీయ ప్రమాణాలతో పాఠ శాల ఆస్పత్రులు నిర్మించి పరిసర ప్రాం తాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు.
పవర్ ప్లాంట్ ఆవరణలోని డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపా ద నలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసు కురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను పవర్ ప్లాంట్ లో ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా ఆసుపత్రి నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయా లన్నారు. బొగ్గు లారీలు ,బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణం గా సిసి రోడ్లను మంజూరు చేయ డం జరిగిందని ,యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్ల ని ర్మాణాన్ని పూర్తిచేయా లని, ఇందుకు సంబంధించి నష్టపరి హారం ,భూసేకరణకు సంబంధించి న పనులు సైతం వెంటనే పూర్తి చే యాలని తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరా ల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయం లోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మం జూరు కావడం జరిగింద ని, అయితే ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని,త్వరితగతిన పను లు పూర్తి చేయాలని చెప్పారు.93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే ప నులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి మాట్లాడుతూ రహదారుల పూర్తికి 280 కోట్ల రూపాయలు మం జూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇ చ్చినట్లు తెలిపారు.మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ని యోజకవర్గంలోప్రవర్ ప్రాజెక్టు ఏ ర్పాటు చేసినప్పటికీ సామాజిక బా ధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్ర జలకు ప్రాజెక్టు నుండి ఎలాంటి స హకారం అందించడం లేదని తెలి పారు.
రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రె ట రీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిఎస్ఆర్ కిం ద నిధులు విడుదల చేశా మని, ప్ర స్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తె లిపారు. వై టి పి ఎస్ లోని అన్ని వి భాగాలలో లాగ్ బుక్ ఆన్లైన్లో నమో దు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డు తోనే యాక్సెస్ అ య్యేవిధంగా చర్యలు తీసుకోవా లని, అన్ని యూ నిట్లలో పాటించే ప్రోటోకాల్ ను పై చార్ట్ లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రోటో కాల్ అప్డేట్ చేయాలని, పాఠశాల ఆస్పత్రుల ఏ ర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని యూనిట్లను నిర్దేశించిన ప్రకా రం డిసెంబర్లో గా పూర్తి చేసి వచ్చే సం వత్సరం జనవరి ,ఫిబ్రవరి నాటి కి అనుకున్న స్థాయిలో విద్యుత్ ఇ చ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వి వరించారు.వైటీ పీఎస్ కు సంబం ధించి రెండు యూనిట్లను పూర్తి చే యడం జరిగిందని, స్టేజి -2లో ఉన్న మూడు యూనిట్లు ఇదివరకే నిర్దే శించిన క్యాలెండర్ ప్రకారం పూర్తి చే యడం జరుగుతుందని, కంట్రోల్ యూనిట్లు, రైల్వే లైన్, ఇతర పను లపై ఆయన వివరాలు తెలియజే శారు.
పర్యావరణ అనుమతుల క్లియ రెన్స్ కారణంగానేరెండేళ్ళు ప్రాజె క్టు పనులు ఆలస్యం…..అనంతరం ఉప ముఖ్యమంత్రి మీ డియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైటిపిఎస్ లోని యూనిట్ వన్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు అందించే యూనిట్ ను జాతికి అంకితం చేయడం పట్ల సంతోషం వ్య క్తం చేశారు. జనవరి 21 2025 న రెం డవ యూనిట్ ను జాతికి అంకితం చేశామని, స్టేజ్ వన్ లోని అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ,స్టేజి- 2 కు సం బంధించిన యూనిట్లలో టార్గెట్ ఏ ర్పాటు చేసుకొని, డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు జనవరి 26 నుo డి పూర్తిగా అంకితం చే సేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్ర భుత్వం రెండు సంవత్సరాలు వైటి పిఎస్ కు సంబంధించిన పర్యావ రణ అనుమతులను క్లియరెన్స్ తీ సుకురాక పోవడం వల్ల రెండు సంవ త్సరాలు ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యాయని, తా ము అధికారంలో కి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించు కొ ని అనుకున్న కార్యాచర ణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చే యాల్సిన పనులపై క్యాలెం డర్ ప్రకారం ముందుకు వెళ్లి సంవ త్సర కాలంలోని రెండు యూనిట్లు పూర్తి చేయడమే కాక, ఈ డి సెంబర్ నాటికి తక్కిన యూనిట్లు పూర్తి చేసేందుకు ముందుకు వెళుతున్న ట్లు తెలిపారు.
విద్యుత్ యూనిట్ పనులు ఆల స్యం కావడం వల్ల ప్రజలపై పడే భా రాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ ఉత్ప దనతో పాటు, వైటిపిఎస్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసు కుంటున్నామని, అంత ర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, చు ట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవ లు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి క్వార్టర్స్ కట్టిస్తున్నామని, ప్ర జల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
రహదారులు దెబ్బ తినకుండా సిసి రోడ్డు పనులు మొ దలు పెట్ట డం జరిగిందని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వది లేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రం గా పరిగణించి ఉద్యోగాలు, పునరా వా స కల్పన చేస్తున్నమని, పు లిచింతల కింద చిట్యాల మండలంలో నష్టపోయిన రైతులకు కూ డా ఉద్యోగా లు ,పరిహారం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
శాసనమండలి సభ్యులు శంకర్ నా యక్ ,నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, హైడల్ డైరెక్ట ర్ బాల రాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మ ల్ డైరెక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి ,జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హె చ్ఆర్ డైరెక్టర్ వి. కు మార్ రాజు తో పాటు, వైటీపీఎస్ పర్యవేక్షక ఇం జనీర్, ఇతర ఇం జనీరింగ్ అధికారు లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.