Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 11:29 am Posted by : praja deveena

ACB trap Ganuga Banda : బిగ్ బ్రేకింగ్, ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామకార్యదర్శి కృష్ణ

ACB trap Ganuga Banda : ప్రజా దీవన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల పరిధిలోని గానుబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బరప టి కృష్ణ రూ. 6వేలు రూపాయలు ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసు కుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎ సిబి డిఎస్పి జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల నూతనంగా ఇంటి నిర్మాణం చేశా డు. అట్టి ఇంటికి ఇంటి నెంబర్ కా వాలని సంప్రదిస్తే రూ.6 వేలు లం చం ఇస్తేనే పని పూర్తవుతుందని చె ప్పడంతో అతను ఏసీబీ అధికారు లను ఆశ్రయించాడని తెలిపారు. దీంతో అతడు ఫిర్యాదు మేరకు ఏ సీబీ అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయంలో సదరు నగదు తీ సుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరుపుతు న్నామని అతడి పై అధికారి ఎంపీడీ వోను పిలిచి విచారిస్తున్నామని కృ ష్ణను కోర్టులో హాజరు పరుచనున్న ట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అ ధికారి పనుల కోసం లంచం అడిగి తే 1064 నెంబర్ కు ఫోన్ చేయా ల ని వారి పేరు గోప్యంగా ఉంచుతా మని తెలిపారు. అదే సమయంలో ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచిం చా రు.