Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 12:27 pm Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం తీపికబురు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో డిసెం బరు నెల రూ.713 కోట్లు విడుదల 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్ ప్రభు త్వం. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబరు నెలకు సంబంధించి రూ.713 కోట్లు బుధ వారం విడుదలయ్యాయి. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతం లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విష యం విదితమే.

ఈ నేపద్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల నిధులు వి డుదల చేయాలని ఆర్థికశాఖ అధి కారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, స రెండర్ లీవ్లు, అడ్వాన్స్లకు సంబం ధించిన పెండింగ్ బిల్లులు పేరుకు పోవడంతో దాదాపు రూ.10 వేల కోట్లకు చేరాయి. దీంతో ఉద్యోగ సం ఘాలు జూన్ లో ఆందోళనకు సిద్ధ పడటంతో ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని అదే నెలలో ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో మొదటిసారి జూన్ నె లాఖరులో రూ.183 కోట్లు విడుద ల చేయగా ఆ తర్వాత ఆగస్టు నుం చి రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తూ తాజాగా డిసెంబర్ నె లకు సంబంధించి రూ. 700 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.