Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 10:22 am Posted by : praja deveena

HCA Files SIT Investigation : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, ది ‘హెచ్‌సీఏ’ ఫైల్స్ పై ‘సిట్’

HCA Files SIT Investigation : ప్రజా దీవెన, హైదరాబాద్: మైదా నంలో ఫోర్లు, సిక్సర్ల కంటే తెరవె నుక జరిగిన ‘ఆర్థిక’ హిట్లు, వికెట్ల పతనాలు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను కుదిపేస్తున్నాయి. నిన్నటివరకు వి లాసవంతమైన కార్లు, వీఐపీ బా క్సులకే పరిమితమైన హెచ్‌సీఏ లీ లలు, ఇప్పుడు ‘సిట్’ (Special Investigation Team) ముంగిట క్లీన్ బౌల్డ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. హెచ్‌సీఏ చుట్టూ ము సురుకున్న అక్రమాల చీకట్లను ఛే దించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘సిట్’ ను రంగం లోకి దించింది. క్రికెట్ బోర్డులో ఇ న్నాళ్లూ సాగిన ‘సిండికేట్’ సామ్రా జ్యానికి ఇక ఎండ్ కార్డ్ పడబోతోం దనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి.

ఇప్పటికే హెచ్‌సీఏపై నమోదైన నా లుగు కీలక కేసులను తక్షణమే సి ట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జా రీ అయ్యాయి.ఇది కేవలం పాత కే సుల దుమ్ముదులపడం మాత్రమే కాదు తాజాగా వెలుగులోకి వచ్చి న సరికొత్త స్కామ్‌లపై కూడా‘సిట్’ థర్డ్ ఐ ఓపెన్ చేయబోతోంది. గతం లో జరిగిన తప్పులతో పాటు, ప్ర స్తుతం తెరవెనుక సాగుతున్న ప్రతి అడుగునూ ఈ స్పెషల్ టీమ్ జల్లె డ పట్టనుంది.

బీసీసీఐ (BCCI) నుంచి హైదరా బాద్ క్రికెట్ అభివృద్ధి కోసం, మౌలి క వసతుల కోసం వచ్చిన కోట్ల రూ పాయల నిధులు.. అసలు లబ్ధిదా రులైన యువ క్రికెటర్లకు చేరకుం డా, కొందరి జేబుల్లోకి ఎలా మళ్లా యనే ‘రూట్ మ్యాప్’ పైనే ఇప్పు డు సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టిం ది. దీనిపై గతంలోనే గట్టి ఫిర్యాదు లు అందిన సంగతి తెలిసిందే.

*వికెట్లు పడ్డాయి, ఇక మ్యాచ్ సి ట్ చేతిలో*

ఈపిచ్‌పై ఇప్పటికే ఒక బిగ్ వికెట్ పతనం జరిగింది. నిధుల దుర్విని యోగం, అధికార దుర్వినియోగం ఆరోపణలపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ (అధ్యక్షుడు), సెక్రటరీ (కార్యదర్శి) లను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించా రు. ఇప్పుడు కేసు సిట్ చేతికి రావ డంతో కేవలం ఈ ఇద్దరేనా, లేక వీ రి వెనుక ఉన్న ‘బిగ్ బాస్‌లు’ ఎవ రు డ్రెస్సింగ్ రూమ్స్ నుండి కార్పొ రేట్ బాక్స్ ల వరకు సాగిన ఈ ‘ఫి క్సింగ్’ కథలో ఇంకా ఎవరెవరి పా త్రలు ఉన్నాయి? అనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో సిట్ వి చారణతో హైదరాబాద్ క్రికెట్ అ సోసియేషన్‌లో మరిన్ని సంచలన నిజాలు బయటకు రావడం ఖా యంగా కనిపిస్తోంది. క్రికెట్ లవర్స్ అందరూ ఇప్పుడు లైవ్ మ్యాచ్ కం టే.. ఈ ‘సిట్’ ఇన్వెస్టిగేషన్ అప్‌డే ట్స్ కోసమే ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు.