Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అట్ట హా సంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవే శాలు
–పట్టు వస్త్రాలు, మేళతాలలతో లబ్దిదారులతో గృహప్రవేశాలు
–తెలకంటి గూడెం కు అన్ని విధా లుగా అండగా ఉంటాం
–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహాలలో భాగంగా పేదలకు ఒక్కోటి 5 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెంలో నిర్మించిన ఇళ్లకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదా రు లు గృహప్రవేశం చేశారు.తేలకంటి గూడెంకు సుమారు 107 గృహాలు మంజూరు చేయడం జరిగింది. వీటి లో 10 గృహాల నిర్మాణం పూర్తికా గా శనివారం రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యం లో లబ్దిదారులు అట్టహాసంగా గృ హప్రవేశాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లాడుతూ 22 ఏళ్ల కింద తాను శాసనసభ్యు లుగా ఉన్న సమయంలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, గ త ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇ వ్వలేదని, రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిపారు. ఒక్కొక్కరికి సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే గృహాలను తాము మంజూరు చే యడం జరిగిందని, పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే త మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
తమ ప్రభుత్వం రేషన్ కార్డుతో పాటు, సన్నబియ్యం ఇస్తున్నామ ని, తేలకంటి గూడెంలో చౌక ధర దుకాణం లేనందున వారం, పది రో జుల్లో గ్రామంలో చౌక ధర దుకా ణం ఏర్పాటు చేస్తామని, అంతేకాక చి న్న చిన్న గ్రామాలకు కూడా డీలర్షిప్ లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తేలకంటి గూడెం నుండి ధర్వేశిపురం కలిపే రహదారి వరకు తారు రోడ్డు ను 25 కోట్ల రూ పాయలతో మంజూరు చేయడం జరిగిందని, వర్షాలు తగ్గిన తర్వాత నెల రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
నల్గొండ జిల్లా కు సాగు నీరు అం దించే ఎస్ఎల్బీసీ ని రెండేళ్లలో ప నులను పూర్తి చేసి సాగునీరు అంది స్తామన్నారు. 450 కోట్ల రూపా య లతో హై లేవెల్ కాలువ సిమెంట్ లైనింగ్ పనులు చేయిస్తున్నామని చెప్పారు. నల్గొండ పట్టణంతో పా టు, చుట్టుపక్కల ఉన్న అన్ని మం డలాల లో రహదారులను మం జూరు చేయడం జరిగిందని వెల్ల డించారు. మహిళా సంక్షేమంలో భాగంగా ఇటీవలే మహిళలకు మెడి కల్ కళాశాల వద్ద 5 కోట్ల రూపాయ లతో పెట్రోల్ బంకు ఏర్పాటుకు శం కుస్థాపన చేసామని, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నామని, అంతేకాక నర్సింగ్ కళాశాల నిర్మిస్తున్నామని, తేలకం టి గూడెం కి 30 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేసామని, ఎల్ఇడి లై ట్లు మంజూరు చేశామని తెలిపా రు.
తేలకంటి గూడెం కి అత్యవసర ని ధులు అవసరమైతే తన నియో జకవర్గ అభివృద్ధి నిధుల నుండి ని ధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా నని తెలిపారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో సుమలత, మాజీ సర్పంచ్ రాంబాబు, కనగల్ మాజీ ఎంపీపీ అనూప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.