Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Reservations : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్లపై వా దోపవాదాల మధ్య విచారణ రేప టికి వాయిదా, తెరపైకి ట్రిపుల్ టెస్ట్ అంశం

 

ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టులో వాడీ వేడిగా వాదనలు కొన సాగుతున్న క్రమంలో రేపటికి (గు రువారం) వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్లు బుట్టెం బారి మాధవరెడ్డి, సముద్రాల ర మేశ్ తరఫున మయూర్ రెడ్డి, బు చ్చిబాబు వాదనలు వినిపించారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీంకోర్టు గతంలో చె ప్పిన అంశాలను తెరమీదకు తె చ్చారు. బీసీలకు రిజర్వేషన్లు పెం చాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏ ర్పాటు చేయాలని అన్నారు. రిజ ర్వేషన్ల శాతాన్ని డిసైడ్ చేయాలని, దీంతో పాటు రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతం మించవద్దని పే ర్కొన్నా రు. ఈ మూడు స్టేజీలను ఫుల్ ఫిల్ చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాల ని అన్నారు.

సామాజిక, ఆర్థిక, విద్య ఆధారంగా పరిశీ లన చేయలేదని చెప్పారు. ఇందిరా సహానీ వర్సెస్ యూనియ న్ ఆఫ్ ఇండియా కేసును ఈ సం ద ర్భంగా పిటిషనర్లు ప్రస్తావించారు. మహారాష్ట్ర విషయంలో ఓబీసీ రిజ ర్వేషన్లు కొనసాగాలంటే ట్రిపుల్ టె స్ట్ డేటా సమర్పించాలని సుప్రీం కోర్టు సూచించిందని గుర్తు చేశారు. కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమి ళనాడు కేసులోనూ ట్రిపుల్ టెస్ట్ మ స్ట్ అని చెప్పిందని అన్నారు. పలు రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ రూల్ పాటిం చకపోవడంతో కోర్టులు ఎన్నికలు నిలిపివేశాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ఇచ్చారని, ఇం కా నోటిఫికేషన్ జారీ చేయలేదని తె లిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శా తానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై దాఖలైన పిటి షన్లపై ఇవాళ వాడి వేడి వాదనలు కొనసాగుతున్నాయి. వన్ మ్యాన్ కమిషన్ వేసినట్టు చెబుతున్న ప్పటి కీ దానిని బయటపెట్ట లేదని అడ్వొ కేట్ వివేక్ రెడ్డి అన్నారు. ట్రిపుల్

టెస్టు లేకుండా రిజర్వేషన్లు 50 శా తం మించొద్దని, అసెంబ్లీలో రిజర్వే షన్ బిల్లు ఎప్పుడు పాసైందని చీఫ్ జస్టిస్ ఏజీని ప్రశ్నించారు.

ఆగస్టు 31న శాసన సభ, మండలి లో పాస్ అయ్యిందని తెలిపారు. దీంతో గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉందా అని ప్రశ్నించారు. అవు నంటూ ఏజీ సమాధానమిచ్చారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవా దులు స్పందిస్తూ జీవో నంబర్ 9తో పాటు 41 కూడా చెల్లదన్నారు. రిజ ర్వేషన్లు పెంచుతూ తీర్మానించిన బి ల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని, జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదన లు విన్న న్యాయస్థానం విచారణ లంచ్ బ్రేక్ తరువాతకు వాయిదా వేసింది.

*పిటిషనర్లపై తెలంగాణ హైకోర్టు అసహనం….* బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్లను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి విచారణ కాదని అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచిం చింది. తమ ఓపికను పరీక్షించకం డంటూ పిటిషనర్లను ఉద్దేశించి సు న్నితంగా హెచ్చరించింది. గంట ల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించి, తమ సమయాన్ని వృథా చేయొద్దని చె ప్పింది.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మను సిం ఘ్వీ తన వాదనలు వినిపించారు.

బీసీ రిజర్వేషన్ల పై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆ మోదించాయని చెప్పారు. జీఓ పై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదని అన్నారు. ప్రజల అవసరాలను దృ ష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు పెంచు కునే అవకాశం ప్రభుత్వానికి ఉంద ని చెప్పారు. పిటిషనర్ లాయర్లు ఇ న్నిగంటలు వాదనలు వినిపిస్తే మా కు అవకాశం వస్తుందా అంటూ ప్ర శ్నించారు. కులగణన లెక్కలు ఫోర్జ రీ అనుకుంటున్నారా వాస్తవాలు తె లియకుండా పిటిషనర్లు ఎలా మా ట్లాడుతారని అన్నారు.

2018లో తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదని, 2019లో EW S 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యా ప్తంగా అమల్లోకి వచ్చాయని అభి షేక్ మను సింఘ్వీ గుర్తు చేశారు. ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటి అదనంగా 10 శాతం అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుందని చెప్పారు. బి ల్లు గవర్నర్‌కు పంపి ఆరు నెలలు అవుతోందని, ఆరు నెలల పాటు గవర్నర్ ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు అటు తిర స్క రించ లేదు, ఇటు ఆమోదించలేదని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నా రు. దీంతో సుదీర్ఘ విచారణ తర్వా త హైకోర్టు రేపటికి ( గురువారం) కు వాయిదా వేసింది.