CBI probe : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తారాస్థాయిలో చర్చ జ రుగుతోన్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రా వులకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరంపై సీ బీఐ విచారణ చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో అధికార కాం గ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనకు హై కోర్టు అంగీకరించలేదు. బీఆర్ఎస్ తరఫున దాఖలైన పిటిషన్ ను స్వీ కరించిన హైకోర్టు తదుపరి విచార ణ వరకు ఎలాంటి చర్యలు తీసు కోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ క్ర మంలో తదుపరి విచారణను అ క్టో బర్ 7కు వాయిదా వేసింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై మం గళవారం విచారణ కొనసాగింది. కా ళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారం గా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలoటూ పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావులు పేర్కొన్నా రు. న్యాయస్థానంలో వారు వేసిన పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు అడ్వకే ట్ జనరల్ కోర్టుకు విన్నవించారు.
ఇదిలా ఉండగా కేసీఆర్, హరీష్‌రా వు పిటిషన్లపై విచారణను అక్టోబర్ 7వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృ ష్టికి ఏజీ తీసుకెళ్లడం, ఈ కేసును తె లంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్ప గించనున్నట్లు హైకోర్టుకు తెలిపా రు. ఇప్పటివరకు వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.
సీబీఐ విచారణ తర్వాత కేసీఆర్, హరీష్‌రావులపై చర్యలు ఉంటాయ ని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వె ల్లడించారు. తదుపరి విచారణ వ రకు చర్యలు తీసుకోవద్దని తెలం గాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కా ళేశ్వరం పై సీబీఐ విచారణ విష యంలో మాజీ సీఎం కేసీఆర్, హ రీశ్ రావులకు తాత్కాలికంగా స్వ ల్ప ఊరట లభించినట్లయింది.