IMD Alert : ప్రజా దీవెన, హైదరాబాద్: బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిన నేపద్యంలో తెలం గాణలోని పలు జిల్లాలకు హైదరా బాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పే ర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించింది.
కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ దేశాలు జారీ చేశారు.పురాతన ఇళ్ల లో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చే యించాలన్నారు. వాగులు, కాజ్‌వే లు, కల్వర్టులపై రాకపోకలు నిషేధిం చాలని చెప్పారు. చెరువులు, కుం టలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశు ద్ధ్య పనులు చేయాలని, అవసర మైన చోట వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలని సీఎం ఆదేశించారు.
*వరద బాధిత జిల్లాల్లో నేడు సి.ఎం. ఏరియల్ సర్వే….* భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు గురువారం నా డు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిం చనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు వెల్ల డించారు. భారీ వర్షాల ప్రభావం తీ వ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, ని జామాబాద్,నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు నేడు రాత్రి టెలీ కాన్ఫరెన్స్ ని ర్వహించి పరిస్థితులను సమీక్షిం చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలపై మ రోసారి నేటి రాత్రి మరోసారి సహా య, పునరావాస కార్యక్రమాలు, ఆ స్తి, ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. వి పత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి అరవింద్ కుమార్, నీటిపా రుదల శాఖ ముఖ్య కార్యదర్శి రా హుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జి ల్లా లకు నియమించేంచిన స్పెషల్ అధి కారులు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడు తూ గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పా లనా యంత్రాంగం సకాలంలో చేప ట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. నేడు కూడా వర్షాలు పడే అవకాశము న్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా రు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే SDRF ,NDRF బృం దాలను పంపిస్తామని తెలిపారు. పోచారం జలాశయానికి నీటి ఇన్- ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారు లు తెలియచేసారు.
వరద నీటిలో చిక్కుకున్న రూప్ సిం గ్ తండా, వా డి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించిన ట్టు తెలిపారు. SRSP నుండి మూ డు లక్షల క్యూ సెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి లక్షా 9 0 వేలక్యూసె క్కుల జలాలను వదు లుతున్నందున, దిగువ ప్రాంతాల ప్ర జలను సురక్షిత ప్రాంతాలకు తర లించాలని జిల్లా కలెక్టర్ కు సి.ఎస్ సూచించారు. కల్వర్టులు, పొంగు తున్న వాగులు, లోతట్టు ప్రాంతాల వద్ద తగు పోలీ సు బందోబస్తు ఏ ర్పాటుచేసి, ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు చేపట్టా లని అన్నారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి పునరా వాస కేంద్రాలకు తరలించిన వారికి తగు ఆహరం, మంచినీరు ఇతర మౌలిక సదుపా యాలను అందిం చాలని అన్నారు. వర్షాల వళ్ళ దె బ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మ ర్లను వెంటనే పునరుద్దరించాలన్నా రు.