Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 10:18 am Posted by : praja deveena

BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ సంచలన వ్యా ఖ్యలు, నదీజలాల పట్ల సీఎంది అ వగాహన రాహిత్యం, మంత్రులది అంతులేని అజ్ఞానం 

BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, బి ఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ అడిగిన ప్రశ్నల కు సమాధానం చెప్పలేక తెలంగాణ ప్రభుత్వం కేసుల డ్రామాలు ఆడు తోందని, కేసులు, బెదిరింపులకు బీ ఆర్ఎస్ లొంగదని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకే కేసుల డ్రామాలు తెరమీదకు తీసుకొచ్చిం దని, అయినా తెలంగాణ రైతాంగం కోసం పోరాటం ఆగదని స్పష్టం చే శారు. మంగళవారం నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్ని కైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ల అభినందన సభ ఘ నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆ ర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతి థిగా హాజరై, ప్రజాప్రతినిధులను అభినందించి సన్మానించారు.

వాస్తవానికి నదీజలాల పట్ల సీఎ రే వంత్ రెడ్డిది అవగాహన రాహిత్యం అయితే మంత్రులది అంతులేని అ జ్ఞానమని సంచలన వ్యాఖ్యలు చే శారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప ట్ల చిత్త శుద్ధితో ఉంటే వెంటనే సహ కార సంఘాల ఎన్నికలు నిర్వహిం చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేటీఆర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన కేవలం కా ల క్షేపం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ద మ్ముంటే, వెనుక నుండి లీకులు ఇ వ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడు తు న్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోం మంత్రి కూడా ఆయనే కాబట్టి, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లా డాలని, శిఖండి రాజకీయాలు చే యడం తగదని విమర్శించారు. ప్ర జా ప్రయోజనాల కంటే కేవలం కే సుల చుట్టూనే ప్రభుత్వాన్ని తి ప్పుతున్నారని, కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు స మాధానం చెప్పలేక ప్రజల దృష్టి మ ళ్లించడానికి నోటీసుల డ్రామా ఆడు తున్నారని ఆరోపించారు. ఆరు గ్యా రంటీలు, రైతు బంధు వంటి హామీ ల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.

కృష్ణా నదీ జలాల విషయంలో తె లంగాణకు జరుగుతున్న అన్యా యంపై మరియు రాష్ట్ర మంత్రుల అజ్ఞానంపై బీఆర్ఎస్ కార్యనిర్వా హక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థా యిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా వేదికగా సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆ య న ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి నదీ జ లాల అంశం పైన ఎలాంటి అవగాహన లే దని కేటీఆర్ అన్నారు. నల్లగొండ జి ల్లాకు చెందిన మంత్రులపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా సాగునీటి శాఖా మంత్రి కి నీళ్లపై కనీస అవగాహనలేదని, ఇ టీవల జరిగిన ఒక మీడియా సమా వేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్న లకు నేను ప్రిపేర్ అయి రాలేదు, రే పు వచ్చి సమాధానం చెప్తానని తప్పించుకోవడాన్ని ఆయన తప్పు బట్టారు. మరో మంత్రిని ఉద్దేశించి “వాటర్ లో నీళ్లు” అని మాట్లాడే అ జ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజ ల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వారు అడ్డదారిలో అధికా రంలోకి వచ్చి హుంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టిం చడం తప్ప వీరికి ప్రజల పట్ల చిత్త శుద్ధి లేదని మండిపడ్డారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గారు గర్జిస్తుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేక ఈ రెండే ళ్లు గా కాలయాపన చేస్తున్నారని ధ్వజ మెత్తారు. డీపీఆర్ (DPR) పంపడం లో విఫలమవడమే కాకుండా, ప్రాజె క్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్ర యోజనాలకు గండికొడుతున్నా ర ని విమర్శించారు.

నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లోన్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆ గదని కేటీఆర్ ప్రకటించారు. సాగు నీటి అంశంపై కేసీఆర్ అడిగిన ప్రశ్న లకు సమాధానం చెప్పలేక ప్రభు త్వం తడబడుతోందని, ప్రజల దృష్టి ని మళ్లించడానికి బెదిరింపులకు ది గుతోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడ దని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పో రాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వాని కి లేదని కేటీఆర్ మండిపడ్డారు. పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శా తం పనులను ఈ ప్రభుత్వం అడ్డు కుంటోందని విమర్శించారు. “కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గర్జిస్తున్నా రు. దానికి సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆ ర్ పై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజం గానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దని, కానీ ఓటమి భయంతో ప్రభు త్వం వెనకడుగు వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. నామినేటెడ్ పద్ధతి పై ధ్వజం ఎత్తారు. ప్రజల్లో ఉన్న వ్య తిరేకతను చూసి ఎన్నికలకు వెళ్ల కుండా, నామినేటెడ్ పద్ధతిలో పద వులను భర్తీ చేస్తూ ప్రభుత్వం కాల క్షేపం చేస్తోందని ఆయన మండిప డ్డారు. ఎన్నికలు పెడితే రైతులు తగిన బుద్ధి చెబుతారనే భయం ముఖ్యమంత్రిలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసా యదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభా వం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలి తాల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేటీ ఆర్ పేర్కొన్నారు. రైతు బంధు, కౌ లు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయ ల భరోసా వంటి హామీలను ప్రభు త్వం విస్మరించిందని ఆయన ఆరో పించారు. ఈ వైఫల్యాల నుండి ప్ర జల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ పై నిరాధారమైన కేసుల లీకులు ఇ స్తున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వా నికి నిజాయితీ ఉంటే.. రైతులకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే.. ద మ్ముంటే సహకార ఎన్నికలు పె ట్టాలని నల్లగొండ వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఎన్ని రోజులు తప్పించుకు న్నా, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని నిల దీ యడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ‘420’ హామీలను అమలు చేయలే క, ప్రజలకు ముఖం చూపలేక ఎన్ని కల నిర్వహణ నుండి తప్పించుకుం టోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రా ష్ట్రంలో సహకార సంఘాల ఎన్నిక ల నిర్వహణపై కేటీఆర్ ప్రభుత్వా నికి బహిరంగ సవాల్ విసిరారు. “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజం గానే మేలు చేసి ఉంటే వెంటనే స హకార ఎన్నికలు నిర్వహించాలి. ఓటమి భయంతోనే నామినేటెడ్ పద్ధతిలో పదవులు నింపుకుంటు న్నారు. రైతులకు గనక అవకాశం వ స్తే కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్ట డం ఖాయమని విమర్శించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎ న్నికలను కూడా ప్రభుత్వం భ యం తోనే వాయిదా వేస్తోందని ఆరోపిం చారు.

కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ.. “అర్జునుడు చిలుక కన్నును లక్ష్యం గా చేసుకున్నట్లు, మన దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమ లుపైనే ఉండాలి. ఎన్ని కేసులు పెట్టి నా, జైలుకు పంపినా భయపడేది లేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్ రైతాంగానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగదని పిలుపుని చ్చారు. జిల్లా మంత్రులకు సాగు నీ టిపై కనీస అవగాహన లేదని, అబ ద్ధాలతో ప్రజలను మోసం చేస్తు న్నా రని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కు మార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమా ర్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కు సుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్ర మంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉ త్సాహాన్ని నింపారు.