Big Breaking: ప్రజా దీవెన, డెహ్రాడూన్: ఉత్తరాఖం డ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉత్తర కాశి జిల్లాలోని యమునోత్రి ఆల యానికి వెళ్లే మార్గంలో బార్కోట్ ప్రాంతంలోని సిలై బెండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఆక స్మాత్తుగా సంభవించిన వరదలకు ఓ హోటల్ కుప్పకూలింది. హోట ల్లోని 9 మంది కార్మికులు వరద ల్లో గల్లంతయ్యారు. మరికొందరు కార్మికులు శిధిలాలలో చిక్కుకున్నా రు. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అ వకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వ హణ శాఖ హెచ్చరించింది. వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారు లు మూతపడ్డాయి.
చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు వి రిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ ర హదారిని మూసివేసినట్లు జిల్లా పో లీసులు ప్రకటించారు. యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చ ర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన ము ఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్ర జలందరూ అప్రమత్తంగా ఉండాల ని కోరారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున చార్ధామ్ యాత్రను ఒక రోజు వాయిదా వేస్తు న్నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. సంబంధి త జిల్లాల పరిపాలన, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితు లు, రోడ్డు మార్గాలను సమీక్షించిన తర్వాత తదుపరి ప్రయాణానికి సం బంధించి నిర్ణయం తీసుకుంటామ ని క్లారిటీ ఆయన ఇచ్చారు.
భక్తులు తదుపరి ఆదేశాలు వచ్చేవ రకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూ చించారు.జూన్ 30, జూలై 1 తేదీ ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం తో ఉత్తరాఖండ్‌కు భార త వాతా వరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిం ది. రాష్ట్రవ్యాప్తంగా ప లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కు రుస్తాయని హెచ్చ రించింది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సూచించింది. ఐఎండీ హె చ్చరికల నేపథ్యం లో రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సహయక బృందాలను అలర్ట్ చేసిం ది.