Jubilee Hills Elections : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ కమలం పార్టీ అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, ఇక ఊపందుకోనున్న ప్రచారం
Jubilee Hills Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజధా ని భాగ్యనగరంలో ఎన్నికల సందడి మరింతగా ఊపoదుకోనుంది. రా ష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీ య పరిణామాలు ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్న తరుణంలో జూ బ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వత్ర ఆసక్తి క రంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తు న్న ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిని ఆ పా ర్టీ అధిష్టానం ఖరారు చేయడంతో పాటు ప్రకటన కూడా బుధవారం విడుదల చేసింది.
తాజా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటిం చగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నా మినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుండడoతో ఇప్పటికే కాం గ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్య ర్థులను ప్రకటించిన విషయం తెలి సిందే. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మా గంటి సునీత బుధవారం నామినేష న్ దాఖలు చేయనుండగా అంతకు ముందే జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
అదే సందర్భంలో అభ్యర్థి ఎంపిక కో సం నియోజకవర్గంలోని పలువురి సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణలో కి తీసుకుంది. అందుకు సంబంధిం చిన జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకవెళ్లి బీజేపీ అధి ష్టా నం కు సమర్పించాడు. రాష్ట్ర పార్టీ సమర్పించిన జాబితాలో ఎట్టకేలకు అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని ఎం పిక చేసి ప్రకటించింది కూడా.
అయితే తాజాగా ఉప ఎన్నిక పో లింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షె డ్యూల్ విడుదల చేయడంతో మా గంటి గోపినాథ్ భార్య సునీతను బీ ఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాద వ్ పేరును ఖరారు చేయగా ఇక బీ జేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం.
ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నిక పో లింగ్ నవంబర్ 11వ తేదీన జరగ నుoడగా ఈ ఎన్నికల ఫలితాలు న వంబర్ 14వ తేదీన వెల్లడి కాను న్నాయి.