Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 10:57 am Posted by : praja deveena

Medical Equipment : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ప్రముఖ వైద్యపరికరాల తయారీ యూనిట్, సీఎం రేవంత్ తో బిగ్ మెడికల్ ప్రతి నిధి బృందం భేటీ 

Medical Equipment : ప్రజా దీవెన, హైదరాబాద్: వైద్య ప రికరాల తయారీలో జర్మనీకి చెంది న ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ (B EBIG Medical) తన ఉత్పత్తి యూనిట్‌ను తెలంగాణలో ప్రారం భించడానికి ఆసక్తిని వ్యక్తీక రించిం ది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని బె బిగ్ మె డికల్ కంపెనీ చైర్మన్, సీఈ వో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృం దం మర్యాద పూర్వకంగా కలిసిం ది.

వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్‌ ను తెలంగాణలో ఏర్పాటు చేయ డానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశా రు. కంపెనీ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబందించి అధ్యయనం చేసి నివే దిక అందించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఈ క్విప్‌మెంట్‌తో పాటు, క్యాన్సర్ చికి త్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కంపె నీ ప్రతినిధులను కోరారు.