Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Local Body Election : బిగ్ బ్రేకింగ్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, అక్టోబర్ 9వ తే దీ నుంచి ఎన్నికల కోడ్ అమలు 

Local Body Election : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమ వారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చే సిన మేరకు తొలుత ఎంపీటీసీ, జ డ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్ని కలు జరుగనున్నాయి.

అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేయనున్న ఎన్ని కల సంఘం ఆ రోజు నుంచే నామి నేషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీ న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై న వంబర్ 11వ తేదీన ముగియనుం ది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు ఎన్నికల ప్రక్రియ పూ ర్వపరాలు వెల్లడించారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణకు అ నుమతి ఇచ్చిందని తెలిపారు. స మయం షెడ్యూల్ ఖరారు చేసుకు న్నామని వివరించారు.

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఖాళీ వివరాలు గెజిట్ నోటిఫికేషన్ నిన్న ఆదివారం తమకు అందిందని వెల్ల డించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారి గా పబ్లిష్ చేశామని తెలిపారు. ఎ న్ని అవాంతరాలు వచ్చినా అధికా రులు ప్రక్రియ పూర్తి చేశారని తెలం గాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రా ణి కుముదిని పేర్కొన్నారు.