Big Breaking: ప్రజా దీవెన, ఛత్తీస్ గఢ్: తెలంగా ణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దు బీజా పూ ర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరి ధిలోని కర్రెగుట్ట కేంద్రంగా జరిగిన ఆపరేషన్లో 31మంది మావోయిస్టు లు మృతి చెందినట్లు సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్వ్ గౌతం తెలిపారు. ఆపరేష న్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 16 మంది మహిళా మావో యిస్టులు ఉన్నట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్ లో మృతి చెందిన మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు. 18 మంది జవాన్లు గాయపడినట్లు చె ప్పారు. మృతి చెందిన మావోయి స్టుల్లో 20 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. 31 మంది మావోయి స్టుల నుంచి 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు కర్రెగుట్ట ఆపరేషన్ నిర్వ హించామన్నారు. ఈఏడాది మావో యిస్టులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లో 174 మంది హార్డ్ కోర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడిం చారు.
ఇదిలా ఉండగా మృతదేహాలతో పాటు స్వాధీనం చేసుకున్న ఆ యుధాలను ఇతర సామాగ్రిని నారాయణపూర్ జిల్లా హెడ్ క్వా ర్టర్స్ కు తరలించారు. అయితే మావోయిస్టు పార్టీ అగ్రజులుగా ఉన్న సీసీ మెంబర్ నంబాల కేశ వరావు ఉరఫ్ బసవరాజుపై చత్తీ స్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రివార్డ్ 1.5 కోట్లు ఉండగా మరో తెలుగు మావోయిస్టు నేత, దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ వెంకట్ నాగేశ్వరరావు ఉరఫ్ యాసన్న ఉరఫ్ జంగు న వీన్ పైనా 25 లక్షల రివార్డ్ ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
