Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 12:33 pm Posted by : praja deveena

Minister Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ కీలక ప్ర కటన, ఇల్లులేని నిరుపేదలకు సం క్రాంతి కానుకగా హౌసింగ్ కాలనీలో ఇళ్లు 

–గురువారం నుంచే ఎమ్మార్వో ఆఫీ సులో దరఖాస్తులకు ఆహ్వానం

–పారదర్శకంగా ఇళ్ల పంపిణీతో

అర్హులైన నిరుపేదలకు ఇళ్ళు

–రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతా

–మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హుజూర్ నగర్: సూ ర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్ట ణంలో ఇల్లు లేని నిరుపేదలకు మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు.పట్టణ శివారు లోనీ రామస్వామి గుట్టవద్ద 115 ఎకరాలలో ప్రభుత్వం నిర్మిస్తున్న 2 160 ఇండ్లను పట్టణంలోని నిరుపే దలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటిం చారు.మార్చి చివరి నాటికి హుజుర్ నగర్ లోని రామస్వామి గుట్టవద్ద నిర్మిస్తున్న హౌజింగ్ కాలనీని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎ న్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నా రు.ఇక్కడ నిర్మిస్తున్న 2160 ఇండ్ల ను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీ ర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

బుధవారం ఉదయం సహచర రెవి న్యూ,గృహ నిర్మాణ మరియు స మాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డితో కలసి హుజూర్ నగర్ లోని హౌజింగ్ బోర్డ్ కాలనీలో జరు గుతున్న నిర్మాణాలను పరిశీలించా రు.

అనంతరం జరిగిన బహిరంగ సభ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ హుజుర్ నగర్ పట్టణం లోని అర్హులైన నిరుపేదలకు ఇక్కడ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు.ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని అర్హు లై న నిరుపేదలకు పారదర్శకంగా ఇ ల్లు మంజూరు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ ప వార్ ను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమా ణాలు పాటించాలని ఇంజినీరింగ్ వి భాగం అధికారులు నిశితంగా పరిశీ లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పేదలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్ర మాణాలు పాటించక పోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించా రు. ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్ల కాలనీ భవిష్యత్ లో ఒక పట్టణంగా రూ పాంతరం చెందనుందని ఈ కాల నీ కి ప్రత్యేకంగా పాఠశాల భవనం, అంగన్ వాడి కేంద్రంతో పాటు క మ్యూనిటీ హాల్, క్రీడా ప్రాంగణం మంజూరు సిగేస్తున్నట్లు మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హౌసింగ్ శాఖామంత్రిగా తాను ఉన్న సమ యంలో నిరుపేదలకు ఇండ్లు కట్టిం చి ఇవ్వాలన్న తలంపుతో దేవాదా య శాఖా భూములను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ ఇం డ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

అయితే ఆ తరువాత అధికారం లో కి వచ్చిన బి.ఆర్.ఎస్ పాలకులు త న మీద ద్వేషంతో కుట్ర పురితంగా ఇండ్ల నిర్మాణాలను నిలిపి వేశారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన నేపద్యంలో త్వరిత గతిన పూర్తి చేసి నిరుపేదలకు అం దించాలన్న తన బలమైన ఆకాంక్ష నేరవేర బోతున్నందుకు మహదా నందంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, స మాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వా లన్న బలమైన తలంపుతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపట్టిన మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి అభినంద నీ యుడని కొనియాడారు.అదే సమ యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రె డ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్క డ 2160 ఇండ్ల నిర్మాణము పూర్తి కావడంతో పాటు ఈ నియోజకవ ర్గానికి మరో 3500 ఇండ్లు మంజూ రు అయ్యాయని,మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గానికి మొత్తం 5660 ఇండ్లు మంజూరు కావడం ఆయన కోరుకున్న ఆకాంక్ష నెర వేరుతుందని చెప్పారు.

*అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కు నిధులు మంజూరు…* హుజుర్ నగర్ లో రూ. 50 కోట్లతో నిర్మించిన పారిశ్రామిక శిక్షణా సంస్థ,అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లలో మౌలిక సదు పాయాల కల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చే శారు. బుధవారం ఉదయం హుజు ర్ నగర్ పట్టణంలోని అడ్వాన్స్ ట్రై నింగ్ సెంటర్ ను ఆయన సందర్శిం చారు.ఈ సందర్భంగా అక్కడ వృత్తి నైపుణ్యం కోర్సులను అభ్యస్తూన్న విద్యార్థులతో ఆయన ముఖాముఖి చర్చించినారు. ఈ సందర్భంగా వి ద్యార్థులు రవాణా సౌకర్యంతో పా టు బాత్రూమ్ ల ఆవశ్యకతను మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించా రు. తక్షణమే స్పందించిన ఆయన అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు అదేశాలిస్తూ మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలన్నారు.

శిక్షణ పొందుతున్న 172 మంది వి ద్యార్థుల నుద్దేశించి ఆయన మా ట్లాడుతూ వృత్తి విద్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉ పాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

*కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్ ల పంపిణీ* హుజుర్ నగర్ ఆ ర్ డిఓ కార్యక్రమంలో జరిగిన కల్యా ణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పం పిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని కోటి 71 లక్షల రూపాయల చెక్ లను లబ్ధిదారు లకు అందజేశారు.ఇదిలా ఉండగా హుజుర్నగర్ పట్ట ణంలో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల తో పాటు రోడ్లు భవనాల వసతి గృ హం,షాపింగ్ కాంప్లెక్స్,రోడ్లు భవనా ల డివిజన్ కార్యాలయం, నీటిపారు దల కార్యాలయ భవనాల నిర్మాణా లను ఆయన పరిశీలించారు. వాటి పురోగతిని పై అధికారులను అడిగి తెలుసు కొ ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో మిర్యాలగూడ శాసనస భ్యులు బిఎల్ ఆర్ జిల్లా కలెక్టర్ తే జస్ నందాలాల్ పవార్, ఎస్.పి న రసింహ తదితరులు పాల్గొన్నారు.