–విశ్వసనీయ సమాచార మేరకు.. మీ కోసం
–మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ నాగు నాయక్ ఘనకార్యం, యూరి యా లారీ దారి మళ్లింపు వైనం
Big Breaking : ప్రజా దీవెన మిర్యాలగూడ: అధికా రం చేతిలో ఉందని అడ్డగోలు వ్యవ హారానికి తెరదీశాడు ఓ అంగరక్షకు డు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంగరక్ష కుడు (గన్ మెన్) అయినవారి కో సం ఆదమరిచి రైతుల కోసం వచ్చి న యూరియా లారీని దారి మళ్లించి నెత్తి నొప్పి తెచ్చి పెట్టుకున్నాడు. రైతుల కోసం కేటాయించిన లారీ లోడ్ యూరియాను దారి మళ్లించి న వ్యవహారం ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో పోలీసు ఉన్నతా ధి కారులు చర్యలకు ఉపక్రమించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యక్తిగత సహాయకుని అవ తారమె త్తిన గన్‌మెన్ నాగు నాయక్ వ్య వసాయ అధికారులకు అప్పటిక ప్పుడు ఫోన్ చేసి యూరియా లా రీని మూడో కంటికి తెలవకుండా దారి మళ్ళించాడు.
ప్రస్తుతం మార్కెట్లో యూరియా డి మాండ్ మేరకు నెలకొంటున్న ఆం దోళన సమస్యల మధ్య కొద్ది రోజు ల తర్వాత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి యూరియాపై ఆరా కోసం అధి కారులకు ఫోన్ చేయడంతో అసలు విషయంతో పాటు గన్‌మెన్ నాగు నాయక్ తతంగం మొత్తం బహిర్గత మైంది.
*గన్ మెన్ వ్యవహారం పై ఎస్పీ సీరియస్…*
మిర్యాలగూడ ఎమ్మెల్యే బస్సుల ల క్ష్మారెడ్డి గన్ మెన్ నాగు నాయక్ వ్యవహారంపై నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్ గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోం ది. ఈ మేరకు ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశారు కూడా తెలి సింది. విచారణ నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తప్పకుండా సంకేతాలు ఇప్పటికే పోలీసు అధి కారుల నుంచి వెలువడినట్టు సమా చారం.
ఇదిలా ఉండగా యూరియా కోసం ముప్పు తిప్పలు పడుతున్న మాకు రావాల్సిన యూరియాను అధికార అజమాయిషి తో దారి అందించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వేలి బు చ్చుతున్నారు. మార్కెట్లో అందుబా టులో లేదని, రెండు బస్తాల కోసం రోజుల తరబడి రోజులు వేచి చూ డాల్సిన పరిస్థితులతో నానా అ వ స్థలు పడుతుంటే అధికార పార్టీ అం డదండలతో కొందరు లారీ లారీలకే మళ్లించుకుంటున్నారని రైతుల ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.