CM Relief Fund Misuse : బిగ్ బ్రేకింగ్, సీఎం సహాయనిధిలో చేతివాటం, చెక్కులు వాడుకున్న అక్రమార్కుని అరెస్టు..?
CM Relief Fund Misuse : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా కోడాడ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అక్రమాలను బట్టబయ లు చేశారు. ఈ అక్రమాల్లో సూత్ర ధారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్య క్తిని అరెస్టు చేసి నకిలీ బ్యాంకు ఖా తాలను ఉపయోగించి ముఖ్య మం త్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదా రులకు జారీ చేసిన చెక్కులను ఉప సంహరించుకోవడంలో సదరు వ్యక్తి ప్రమేయoపై ముమ్మర దర్యాప్తు చే స్తున్నారు. సీఎంసహాయనిధి ని ధు లు పక్కదారి పట్టించే ఈ ముఠా స భ్యులు తెలంగాణలో కనీసం 50 మంది లబ్ధిదారుల చెక్కులను నగ దుగా మార్చుకుని వారిని మోసం చేశారని పోలీసులు ప్రాథమిక అం చనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి కథాకమీషు ఇలా ఉంది.
ముఖ్యమంత్రి సహాయనిధికి 202 2లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ త నకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని కోదాడ కు చెందిన దర ఖాస్తుదారుడు ఒకరు ఫిర్యాదు చే యడంతో నీటిపారుదల శాఖ మం త్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి CMR F కార్యాలయంలో విచారించగా ఈ దగామోసం వెలుగులోకి వచ్చింది. గద్దె వెంకటేశ్వర్ రావుగా గుర్తించబ డిన దరఖాస్తుదారుడు మంత్రి కా ర్యాలయం నుండి తన పేరు మీద ₹1.5 లక్షల చెక్కు జారీ చేయబడి ఉపసంహరించుకున్నట్లు తెలుసు కున్న తర్వాత కోదాడ గ్రామీణ పో లీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన క్రమంలో కోదాడ రూరల్ పోలీసులు గడ్డం వెంకటేశ్వ ర్ రావుపై కేసు నమోదు చేశారు, అ తను ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట లోని తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఖాతాలో చెక్కును జమ చే యగా పోలీసులు ఇప్పటికే అతన్ని అరెస్టు చేసినట్లు విశ్వసనీయ స మాచారం. తన గుండె శస్త్రచికిత్స ఖర్చులను భరించడానికి 2022లో అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కార్యాలయం ద్వారా CM RF నుండి 2.5 లక్షలకు దరఖాస్తు చేసుకున్నానని రావు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సం ప్రదించినప్పుడు, చెక్కు ఇంకా జారీ కాలేదని సిబ్బంది తెలిపారు.
ఈ నేపథ్యంలో అతను తన పెండిం గ్ దరఖాస్తు గురించి ప్రస్తుత ఎమ్మె ల్యే ఎన్. ఉత్తమ్ పద్మావతి కార్యా లయాన్ని సంప్రదించాడు. ఆమె సి బ్బంది పరిస్థితిని తనిఖీ చేయడా నికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసును సంప్రదించారు. ఆగస్టు 20, 2023 న రూ. 1.5 లక్షల చెక్కు జారీ చే యబడిందని, అందుకు సంబంధిం చి నగదుగా మార్చుకున్నట్లు వి చా రణలో తేటతెల్లమైంది. ఆ చెక్కు నబర్‌ను ఉపయోగించి, వెంకటేశ్వ ర్ రావు ఆ మొత్తాన్ని జమ చేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. రెండు రోజు ల క్రితం సంప్రదించినప్పుడు పోలీ సు అధికారులు వివరాలను వెల్ల డించేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా సీఎం సహాయనిది చెక్కుల అక్రమాలకు దారి తీసిన పరిస్థితు లపై దర్యాప్తు కొనసాగుతున్నందు న పూర్తి వివరాలు మరిన్ని తెలియా ల్సి ఉంది.