Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 10:53 am Posted by : praja deveena

District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–ప్రసూతి వార్డులో పురుషులు ఉం డడంపై ఆగ్రహం

–ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలన్నీ పనిచేయాలని సూపరింటిండెంట్ కు ఆదేశo

District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రసూతి వా ర్డులో పురుషులు ఉండడం ఏంటని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ప్రశ్నించారు. అలాగే వార్డులో ఉ న్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని చెప్పారు.మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆ సుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, చిన్న పిల్లల వార్డు, ఐసీయూ తదితర వా ర్డులలో తనిఖీలు నిర్వహించారు.

కాగా ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే అందరిని బయట కు పంపించాలని, పురుషులను ప్ర సూతి వార్డులోకి ఎందుకు అనుమ తించారని డ్యూటీ డాక్టర్ పై ఆగ్ర హం వ్యక్తం చేయడమే కాకుండా, ఇ దే విషయంపై జిల్లా ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రి సూపరిండెంట్ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి లో ప్రసవించిన మహిళలకు సహా యకులు ఎక్కువమంది ఉండడం వల్ల చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ,అందువల్ల ఎక్కు వ మంది ఉండకుండా, కేవలం ఒక్క రు మాత్రమే సహాయకులుగా ఉం డేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు.

అనంతరం ఆసుపత్రిలోని ప్రతి వా ర్డులో ఉన్న సీసీ కెమెరాలు, ఆరు బ యట వాహనాలు నిలిపే చోట ఇత ర ముఖ్యమైన స్థలాలలో ఉన్న సీసీ కెమెరాలను ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీ కెమె రాలు నిరంతరం పనిచే యాలని ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు 24 గం టలు పని చే సేలా చర్యలు తీసుకో వాలని ఆ సు పత్రి వర్గాలను ఆదేశించారు.

ప్రత్యేకించి ఆటోలు నిలిపే చోట సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసు పత్రి సూపరింటిండెంట్ అ రుణకు మారి,డాక్టర్ వందన, డాక్టర్ నగేష్ తదితరులు ఉన్నారు.