Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, జైలుజీవితం తర్వాత సమాజానికిమంచి చేయాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జైలు జీవి తం నుండి బయటికి వచ్చిన తర్వా త సమాజానికి మంచి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతిని పు రస్కరించుకొని గురువారం ఆమె జి ల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం సంపాదించే క్రమంలో మహాత్మా గాంధీ అనేకసా ర్లు జైలుకు వెళ్లారని, సత్రాగ్రహం ద్వారా స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ కృషిని పదిమందికి చాటి చెప్పాలని తెలిపారు.ఖైదీలు జైలు జీవితాన్ని అనుభవంగా, ప్రేరణగా తీసుకొని సమాజంలో అడుగుపెట్టి న తర్వాత పదిమందికి సహాయం చేసే విధంగా మెలగాలని పిలుపుని చ్చారు.
జైలులో సమయాన్ని వృధా చేయ కుండా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవాలని, చదువు ద్వారానే ఆలో చన పెరుగుతుందని, అది మంచికి ఉపయోగపడేలా మలుచుకోవాల ని చెప్పారు. ఏది నేర్చుకోవాలన్న క ష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అల వాటు చేసుకోవాలని, ప్రతి మనిషికి ఒకసారి అవకాశం వస్తుందని చె ప్పారు.
చిన్నప్పుడు కష్టపడితే పెద్దయిన త ర్వాత సుఖపడుతారని, వయసు పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుంద ని, కుటుంబ సభ్యులు మనమీద ఆధారపడే పరిస్థితి ఉంటుందని అ న్నారు.అడిషనల్ ఎస్పీ రమేష్ , ఆ ర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా జైలర్ ప్ర మోద్, బాలకృష్ణ తదితరులు హాజ రయ్యారు.
*రామగిరి గాంధీజి విగ్రహానికి ఘనంగా నివాళులు…* గాంధీ జ యంతిని పురస్కరించుకుని అంత కు ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు నల్లగొండ జిల్లా కేంద్రంలో ని రా మగిరి బజార్ లో గల గాంధీజి వి గ్ర హానికి పూలమాలవేసి ఘనంగా ని వాళులర్పించారు. ఈ కార్యక్రమం లో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి హాజరయ్యారు.