POCSO Court Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సోకోర్టు సంచలన తీర్పు, చెల్లివరుస బాలిక ను చెరిచిన దుష్టబుద్ధుడిని 21ఏళ్ల జైలుశిక్ష
POCSO Court Verdict : ప్రజా దీవెన, నల్లగొండ: వావివరుస మరిచి మాయమాటలతో బాలికను చెరిచి గర్భవతిని చేసిన దుష్ట బు ద్ధునికి తగిన బుద్ధి చెప్పింది నల్ల గొండ పోక్సో కోర్టు. ఎస్సీ, ఎస్టీ నల్ల గొండ కోర్టు, రెండవ అదనపు, ఫో క్సో, ఫాస్ట్ కోర్టు జడ్జి ఎన్. రోజార మణి సంచలన తీర్పు వెలువరిం చారు. శుక్రవారం వెలువడిన కీలక తీర్పు పూర్వాపరాలు ఇలా ఉన్నా యి.
తల్లిదండ్రులు చనిపోయారని తల దాచుకోవడానికి పెద్దమ్మ ఇంటికొ చ్చిన బాలికను, ఆమె కొడుకు వా యివరుసలు మరిచి లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ హృదయవిదారక సంఘటన నాలు గేళ్ల క్రితం 2021 జూన్ లో జరగగా న్యాయస్థానంలో విచారణ కొనసా గుతూ ఎట్టకేలకు శుక్రవారం తుది దశకు చేరుకుంది.
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండ లంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బా లిక తల్లిదండ్రులుచనిపోయారు. ఆ మె తండ్రికి నల్లగొండ మున్సిపాలి టీలో పనిచేస్తూ చనిపోవడంతో, ఆ ఉద్యోగం ఆయన తమ్ముడు నూనె మల్లయ్యకు ఇచ్చి, ఆ బాలికను సా కేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో వారు చదువు మాన్పించి, కూలిపనులకు పంపుతున్నారు. దీంతో బాలికి నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొట్టగూ డలో నివసిస్తూ ఆమె పెద్దమ్మ ఇం టికి వచ్చింది. ఆమె మున్సిపాలిటీ లో స్వీపర్ గా పనిచేస్తూ తెల్లవారు జామున 4 గంటలకే విధులకు వె ళ్ళే క్రమంలో చింతపల్లి నాగేష్, బా లికను వేదిస్తూ లైంగిక దాడికి పా ల్పడేవాడు.
అదే సమయంలో నార్కెట్ పల్లి మండలం భాజాకుంటలో ఉండే త న మేనత్త ఇంటికి వెళ్లగా, బాలిక గ ర్భం దాల్చినట్లు వెల్లడింది. తన పి న్నికొడుకు తనపై ఎన్నోసార్లు లైంగి కదాడికి పాల్పడ్డాడని, ఎవరికైన చె బితే ఇంతకు ముందే తాను ఓ వ్య క్తిని హత్యచేశానని, తనను కూడా చంపుతానని బెదిరించాడని మేన త్తకు వివరించింది.
దీంతో వెంటనే ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిం ది. వారు క్రైం నెంబర్ 214/2021, ఎస్సీ నెంబర్ 234/2021, యూ ఎస్/ఎస్ 376(2)(ఎన్), 506 ఐపీ సీ, 5(జే)(2)(1)(ఎన్) ఆర్/ డబ్ల్యూ 6 ఆఫ్ ఫోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు వాయిదాలపై నడుస్తూ అక్టోబర్ 24 శుక్రవారం ఫైనల్ కు వచ్చింది.
ప్రస్తుత వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రా జశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టులో సాక్షాదారాలు ప్రవేశపెట్టారు. జడ్జి పూర్వాపరాలను పరిశీలించి, చింత పల్లి నాగేష్ ను దోషిగా నిర్దారిస్తూ, 21 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో జరి మానా చెల్లించని పక్షంలో ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.5వేల జ రిమానా విధించబడుతుందని ఆ దేశించారు. కాగా, బాధిత బాలికకు రూ.30వేలు జరిమానా, ప్రభుత్వం నుంచి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని జడ్జి తీర్పు చెప్పారు.
ఇదిలా ఉండగా దోషికి కఠిన శిక్ష ప డేలా పీపీ వేముల రంజిత్ కుమార్, దర్యాప్తు అధికారి ఎన్.సురేష్, అ ప్పటి వన్ టౌన్ సీఐ వి.బాలగోపా ల్, ప్రస్తుత డీఎస్పీ కె.శివరామ్ రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి, బరోసా లీగల్ ఆఫీసర్ ఎం. కల్పన, అనుసంధాన అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లి కార్జున్లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. కేసును ద ర్యా ప్తు చేసి, సాక్షాదారాలు సేకరించిన పోలీస్ సిబ్బందిని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ సంద ర్భంగా అభినందించి సన్మానించా రు.
