Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 9:22 am Posted by : praja deveena

BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కో ర్టు-2 అదనపు జిల్లా జడ్జి రోజారమ ణి సంచలన తీర్పు, భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కఠిన శిక్ష

BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు-II అద న పు జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్.రోజా ర మణి మరోసారి సంచలన తీర్పు వె లువరించారు. మానవీయ విలువ లు మరిచి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పక్కా పథ కం ప్రకారం మద్యంలో విషం కలిపి భర్తను దారుణంగా హత్య చేసిన భార్యకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడంది. నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు-II అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్.రోజా రమణి సో మవారం ఉదయం ఈ మేరకు మ రోసంచలన తీర్పు వెల్లడించారు.

సదరు కేసుకు సంబంధించిన కథా కమీషు ఇలా ఉంది. పరిశీలిస్తే దేవ రకొండ మండలంలోని శేరిపల్లి గ్రా మపంచాయతీ పరిధిలోని పెద్దతం డాకు చెందిన రమావత్ మోతీలా ల్, భార్య లలితతో కలసి అదే తం డాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ దంపతు లిద్దరికీ వీరికి పందొమ్మిదేళ్ల కొడుకు, ఇరవైరెండేళ్ల కూతురు ఉండగా ఈ క్రమంలోనే లలిత మరో వ్యక్తితో వి వాహేతర సంబంధం పెట్టుకుని, హై దరాబాద్ సరూర్ నగర్ లోని నివ సిస్తుంది.

ఇద్దరి మధ్య తరచుగా గొడవల కా రణంగా భర్త మోతీలాల్ పై పలు మార్లుగా సరూర్ నగర్ పోలీస్ స్టేష న్ లో ఫిర్యాదులు కూడా చేసింది. 2021 డిసెంబర్ 29వ తేదీన హై ద రాబాద్ నుంచి తనతో పాటు తెచ్చి న ఓ విషపధార్థాన్ని, మోతీలాల్ కు మద్యంలో కలిపి తాపించింది. మ రుసటి రోజు ఉదయం పొద్దుపోయే వరకు కూడా రాకపోవడంతో అన్న శివరాం వచ్చి చూసే సరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. లలితను గట్టి గా అడగడంతో నిజం ఒప్పకుంది. వెంటనే దేవరకొండ పోలీస్ స్టేషన్ లో శివరాం ఫిర్యాదు చేయడంతో క్రైం నెంబర్ 379/2021, ఎస్సీ నెం బర్ 555/2022, యూ/ఎస్302 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి అప్పటి సీఐ కే. బీసన్న దర్యాప్తు ప్రా రంభించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

అప్పటి నుంచి కేసు వాయిదాలపై వాయిదాలుగా ముందుకు సాగు తూ ఎట్టకేలకు సోమవారం ఫైనల్ కు రావడంతో న్యాయమూర్తి రోజా రమణి కేసు పూర్వపరాలను పరిశీ లిచి లలితను నేరస్తురాలిగా నిర్ధా రించి, జీవితకాలపై కఠిన శిక్ష, రూ. 1000 జరిమానా విధించారు. జరి మానా చెల్లించకుంటే మరో నాలు గు నెలలపాటు సాధారణ శిక్ష అను భవించాల్సి ఉంటుందని జడ్జి వెల్ల డించారు. నేరస్తురాలికి శిక్ష పడేం దుకు సహకరించిన అదనపు పీపీ గ్రిడ్-1 ఆ ర్.అఖిల, దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డికి, కోర్టు కానిస్టేబుల్ లిం గయ్య, లైజన్ అధికారులు పి. న రేందర్, ఎన్. మల్లికార్జున్ లను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.