Politicsతెలంగాణనల్గొండ

Udupi Hotel : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఉడిపి హోట ల్ పై చర్యలకు నోటీసులు జారీ, సాంబార్ లో జెర్రీ ప్రత్యక్షంతో షాక్

Udupi Hotel : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు లో సుదీర్ఘకాలంగా పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్‌ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోజువా రీగా అల్పాహార సమయంలో ఓ వినియోగదారునికి సరఫరా చేసిన సాంబార్‌లో జెర్రీ ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమం లో ఇదేంటయ్య అంటూ సాంబార్‌ లో జెర్రీ వచ్చిందoటూ సదర్ విని యోగదారుడు ప్రశ్నించడంతో ఈ లోపు విషయం సామాజిక మధ్య ల్లో చక్కర్లు కొట్టడంతో అధి కాస్త వివాదంగా మారింది.

వినియోగదారులు ప్రశ్నల మీద ప్ర శ్నలు సంధించడంతో ఒక్కసారిగా కంగుతిన్న హోటల్ సిబ్బంది మా యజమానికి చూపిస్తామoటూ సాం బార్‌ను లోపలికి తీసుకెళ్లి కొద్దిసే ప టి తర్వాత బయటకు వచ్చి విష యం బయటకు రాకుండా సాం బా ర్‌ను పారేసినట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఈ సందర్భంగా హోటల్‌ లో ఇలాంటి దురదృష్టకర సంఘట న చోటు చేసుకోవడంపై జరగడంపై అల్పాహార ప్రియుల నుండి ఆగ్ర హం పెల్లుబికితోంది.

*హోటల్ పై అధికారుల దాడు లు* ఫుడ్ సేఫ్టీ అధికారుల తని ఖీ లు అవసరమంటూ కస్టమర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికా రులు వెలువెంటనే హోటల్ లో తని ఖీలు చేపట్టారు. నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో సాంబార్‌లో (జెర్రీ) ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారం గా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు మంగళవారం సదరు ఫిర్యాదుపై త క్షణ తనిఖీలు, చర్యల నిమిత్తం ఫు డ్ సేఫ్టీ అధికారులను ఆదేశించ డం తో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) హోట ల్‌ను తనిఖీ చేయడం ద్వారా పలు లోపాలను గుర్తించారు.

ప్రధానంగా ఫుడ్ లైసెన్స్ ప్రదర్శించ కపోవడం, ఆహారం నిర్వహించే సి బ్బంది ప్రాథమిక పరిశుభ్రత నిబం ధనలు పాటించకపోవడం, ఆహార పదార్థాలను నేలపై నేరుగా నిల్వ చేయడం, రవ్వ మరియు పిండి వం టి ఆహార పదార్థాలలో అనవసర పదార్థాలు ఉండటం మరియు పు రుగులు పట్టి ఉండటం, స్టోర్‌రూమ్ బయటకు నేరుగా తెరిచి ఉండటం, రక్షణ జాలం లేకపోవడం వల్ల ఎలు కలు, పురుగులు, దుమ్ము మరియు తేమ లోనికి ప్రవేశించే అవకాశం ఉండటం, కూరగాయలను పరిశుభ్ర త లేని పరిస్థితుల్లో బయట నిల్వ చేయడం వల్ల ఈగలు, పురుగులు మరియు దుమ్ముకు గురికావడం వంటి అనేక లోపాలను గుర్తించా రు.

అదేవిధంగా వంటగది మరియు స్టో ర్‌రూమ్‌లలో పొగ మచ్చలు, దు మ్ము మరియు నూనె మరకలు ఉం డటం, అనుమతించిన పరిమితు లను మించి వంట నూనెను పున ర్వినియోగం చేయడం, RUCO మార్గదర్శకాలకు అనుగుణంగా ఎ లాంటి రికార్డులు నిర్వహించకపో వడం తో పాటు కీటక నియంత్రణ, ఫుడ్ హ్యాండ్లర్స్ శిక్షణ, డీప్ క్లీనింగ్ మరియు స్టోర్ రిజిస్టర్లకు సంబం ధించిన రికార్డులు లేకపోవడo పై అధికారులు అభ్యంతరాలు వెలిబు చ్చారు.

ఈ నేపథ్యంలో ఉడిపి హోటల్ కు నోటీసులు ( Notice) జారీ చేశారు.

పురుగులు పట్టిన 6 కిలోల ఉప్మా ర వ్వ మరియు 3 లీటర్ల వాడిన వం ట నూనెను ధ్వంసం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం రెండు నమూనాలు పరీక్షల కోసం సేకరించారు. సురక్షిత ఆహార ని ర్వ హణ మరియు నిల్వ విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

హోటల్ సిబ్బందికి ఆహార పదార్థా ల సరైన నిల్వ విధానాలు, పరిశుభ్ర త పాటించాల్సిన నిబంధనలు మ రియు ఆహార కలుషితాన్ని నివారిం చే చర్యలపై అవగాహన కల్పించ డం జరిగింది. నాణ్యత లోపాలు ఉ న్న, వినియోగానికి అనర్హమైన ఆ హార పదార్థాలను అక్కడికక్కడే గు ర్తించి నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు.

సేకరించిన ఆహార నమూనాల ప్ర యోగశాల నివేదికలు ఆధారంగా ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ప్రకారం తదుపరి చట్టపర మై న చర్యలు చేపట్టబడతాయని ఉ మ్మడి నల్లగొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి వె ల్లడించారు. ఈ రకమైన ఉల్లంఘ నలకు పాల్పడి నిర్లక్ష్యంగా వ్యవ హ రించి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సదరు వ్యాపారులను హె చ్చరించారు.

Related Articles

Back to top button