Deputy Chief Minister Pawan Kalyan :
ప్రజా దీవెన జగిత్యాల్: జగిత్యాల జిల్లా లోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శని వారం దర్శించుకున్నారు. కొండగ ట్టు ఆలయ అధికారులు కొండగట్టు సన్నిధికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా ఆయన ఆలయం వద్ద ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప వన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవే ల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వా మి వారిని దర్శించుకున్నారు. స్వా మివారికి నూతన వస్త్రాలు సమ ర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. భక్తి పూర్వకంగా ఆలయం చు ట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సార్వత్రిక ఎ న్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనే య స్వామి ఆలయ అభివృద్ధికి సహకరి స్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థా పన చేసేందుకు విచ్చేసి ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛై ర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కు మార్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యంతో కలసి ఆలయానికి చేరు కున్న ఉప ముఖ్యమంత్రి పవన్ క ళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయశా ఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు.
ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంప్రదాయబద్దంగా ఆ లయంలోకి ఆహ్వానించారు. అనం తరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అ నంతరం ఆలయ అర్చకులు వేదా శీర్వచనాలు అందించి, స్వామి వా రి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవా దాయ శాఖ కమిషనర్ హరీష్, ఈ వో టి. శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి. ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దే వాదాయశాఖ సలహదారు గోవింద్ హరే, జనసేన ప్రధాన కార్యదర్శి రా మ్ తాళ్లూరి, శ్రీ ఆర్ కె సాగర్ తదిత రులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శిం చుకున్న వారిలో ఉన్నారు.

