Politicsతెలంగాణనల్గొండ

Nalgonda BJP Congress Clash : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ నగరంలో గరంగరం, జిల్లా కేంద్రలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఘర్షణతో రాజకీ య రగడ

Nalgonda BJP Congress Clash : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాకేంద్రంలో రాజకీయ వాతావ రణం ఒక్కసారిగా వేడెక్కింది. బీ జేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో నల్ల గొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదు పు తప్పేలా కనిపించగా.. పోలీ సులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టారు.రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్‌ కా ర్యాలయం సమీపంలో బీజేపీ నా యకులు ఆందోళన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి భారీ కటౌట్‌ ను దహనం చేయడంతో పాటు, కార్యాలయంపైకి కోడిగుడ్లు, ట మాటాలు విసిరినట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ శ్రేణులు తీ వ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనం తరం బీజేపీ కార్యాలయం వైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్లేం దుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిపై జరిగినట్లు చెబుతున్న దాడిని నిరసిస్తూ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీ కార్యాల యం వైపు వెళ్లేందుకు ప్రయత్నిం చినట్లు సమాచారం. పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.డీఎస్పీ శివ రాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కా రులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకుల ఫ్లెక్సీ లను కాంగ్రెస్‌ కార్యకర్తలు చించి వేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి ఆరోపణలు

మరోవైపు, మంత్రి క్యాంప్‌ కార్యా లయం వద్ద జరిగిన ఘటనకు ప్ర తిచర్యగా నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇం టిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి ప్రయత్నించినట్లు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వి వరాలు అధికారికంగా వెల్లడి కా వాల్సి ఉంది.

భారీగా పోలీసుల మోహరింపు

పరిస్థితిని అదుపులోకి తీసుకు నేందుకు గడియారం సెంటర్‌, ఇందిరా భవన్‌ పరిసరాల్లో పో లీసులు భారీగా మోహరించారు. ఘటనకు సంబంధించిన వీడి యోలు, ఇతర ఆధారాలను ప రి శీలిస్తూ బాధ్యులపై చర్యలకు పో లీసులు సిద్ధమవుతున్నట్లు స మాచారం.ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండ టం తో నల్లగొండలో రాజకీయ ఉద్రిక్త త కొనసాగుతోంది. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచే సుకోకుండా పోలీసులు అప్రమ త్తంగా ఉన్నారు.అసలు ఘటన లో ఏం జరిగింది? ఎవరి ఆరోప ణల్లో నిజమెంత? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబో తు న్నారు? అనే దానిపై పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button