Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 1:18 pm Posted by : praja deveena

BigBreaking politicalMurder : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో ఉద్రిక్తత, కాంగ్రెస్ శ్రేణుల దాడిలో బిఆర్ ఎస్ సీనియర్ కార్యకర్త మృతి 

BigBreaking politicalMurder : ప్రజా దీవెన, తుంగతు ర్తి: పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంలో భాగం గా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ని యోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్ కార్య కర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడి చే యడంతో బి ఆర్ ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ( 55) ఘటనా స్థలం లోనే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసు కుంది. స్థాని క సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మృతుని కోడలు బిఆ ర్ఎస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేస్తుంది.

ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది, దీంతో రాత్రి తమ పార్టీ కి చెందిన కార్యకర్తలకు డబ్బు లు మద్యం పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఒకరిపై ఒక రు ఆ రోపించుకున్నారు. ఈ క్రమంలో ఇ రు పార్టీలకు చెందిన నా యకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు , ప్రతి ఆరోపణలు చేసుకుం టూ తోపులాటలకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు వాగ్వాదం చేసు కుంటూ పరస్పరం దాడులకు దిగారు.

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు కర్రలతో బిఆర్ఎస్ కార్యకర్తలపై దా డులకు దిగడంతో బిఆర్ఎస్ కార్య కర్త ఉప్పుల మల్లయ్య తల పై కర్రలు, రాళ్లు, ఆయుధాలతో దాడి చే యడంతో తలపై తగలడం తో తీవ్ర గాయాలపాలై రక్తస్రావం జరిగింది. వెనువెంటనే దీంతో అ తడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచా రు. ఈ దాడుల్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు మల్లయ్య తో పా టు మరో 15 మంది కూడా తీవ్ర గాయాల య్యా యి.

ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. మృతుడికి భార్య ఒక కూతురు కుమారుడు ఉన్నారు, విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామా న్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుం డా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు స్థానిక పోలీ సులు.

హత్య కేసులో 08 మంది నిందితుల అరెస్ట్… నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధి లింగంపల్లి గ్రామంలో జరిగిన ఉప్పుల మల్లయ్య హత్యకు సంభందించి 8 మంధిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చామని జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. నిన్నటిరోజు 09వ తేదీన నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రాత్రి సు మారు 11.00 గంటల సమయంలో లింగంపల్లి గ్రామంలోని వర్గ విభేదాలు వల్ల ఘర్షణ జరిగి మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

సూర్యాపేట ఆసుపత్రికి అటునుండి వనస్థలిపురం లో హాస్పటల్ కు చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్ తెలి పినారు. దీనిపై కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నిందితులు ఏ1 ఉప్పుల సతీష్ ఏ2 కొరివి గంగయ్య ఏ3 వీరబోయిన సతీష్ ఏ4 ఉప్పుల గంగయ్య ఏ5 ఉప్పుల ఎలమంచి, ఏ6 వీరబోయిన లింగయ్య, ఏ7 కారింగుల రవీందర్, మరియు ఏ8 దేశపంగు అవి లయ్య లను గుర్తించి అరెస్టు చేశమని అదనపు ఎస్పి తెలిపినారు.

గొడవలు మనసులో పెట్టుకొని ఇరు వర్గాలు గొడవపడి పరస్పరం కర్రలు మరియు రాళ్ళతో కొట్టుకోగా ఉప్పుల మల్లయ్య తలకు తీవ్ర మైయన రక్తగాయం అయినది. వెంటనే సూర్యపేట ప్రభుత్వ ఆసు పత్రి కి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వనస్తలి పురం ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలిం చి చనిపోయినాడు అని తెలిపినారు. ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 8 మందిని అరెస్టు చేయడం జరిగిన ది.

నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇట్టి కేసు ఛేదించి, సమర్దవంతంగా పని చేసిన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, తుంగతుర్తి సర్కిల్ సిఐ ఎ. నరసింహ రావు, నూతనకల్ ఎస్ఐ ఆర్. నాగరాజు మరియు నూతనకల్ పోలీసు స్టేషన్ సిబ్బం దిని అభినంధించారు. ఇదిలా ఉండగా నిందితుల నుండి రెండు కర్రలు, ఒక మంచం అడ్డ పట్టే కర్ర, మూడు రాళ్ళు, 4 సెల్ ఫోను లు స్వాధీనపరచకున్నట్లు తెలిపారు.