PRTU State Leadership : బిగ్ బ్రేకింగ్, పిఆర్ టియూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా పుల్గం దా మోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ లు
PRTU State Leadership : ప్రజాదీవెన,హైదరాబాద్:పిఆర్ టి యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గా పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలో సంఘ భవ నంలో జరిగిన 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర అ ధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిం గిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఇటీవల రాష్ట్ర అధ్యక్ష ప దవి ఖాళీ అయిన నేపద్యంలో 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు ల సమావేశం నిర్వహించారు.
ఇందులో రాష్ట్ర శాఖ ప్రస్తుత ప్రధా న కా ర్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి ని అధ్యక్షునిగా, సుంకరి భిక్షం గౌడ్ ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా ఎ న్నికల అధికారులుగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్ గార్లు వ్యవహరించగా ఏక గ్రీ వంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ సంఘ నిర్మాణం మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వా నికి ఇచ్చే ప్రాతినిధ్యంలో రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీలకం గా వ్యవహరిస్తారని, పి ఆర్ టి యు సంఘం మాత్రమే ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేసి సమ స్యలను ప్రభుత్వంచేత పరిష్కరింప చేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆడిట్ కమిటీ ఛై ర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ సమా వేశంలో మాజీ ఎమ్మెల్సీ బి. మోహ న్ రెడ్డి, కరీంనగర్ ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి వంగ మ హేందర్ రెడ్డి, పత్రిక ప్రధాన సంపాద కులు జగన్మోహన్ గుప్త తదితరులు పాల్గొన్నారు.