Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 8:54 am Posted by : praja deveena

Road Development Projects : బిగ్ బ్రేకింగ్, రహదారులకు దండిగా నిధులు, రికార్డుస్థాయిలో రూ. 60, 799 వేలకోట్ల నిధులకు ఆమోదం 

Road Development Projects : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో రహదారుల నిర్మాణంకు రూ. 6 0,799 వేల కోట్ల మంజూరుకు సహ కరించిన, గొప్ప కార్యక్రమానికి అను మతులు ఇచ్చి నిధుల మంజూరు కు ఆమోదం తెలిపిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలి పారు. ఈ క్రమంలో మౌలిక సదు పాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మా రబోతోందన్న అభిప్రాయం వ్యక్తం అ వుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్న నేపద్యంలో లక్ష లాది మంది గ్రామీణ యువతకు ఉ పాధి కలగనుందని మంత్రి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇందులో భాగంగా రూ. 10,400 కో ట్లతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వ రుసలుగా విస్తరణకు మార్గం సుగ మమైంది. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే ఆర్ ఆర్ ఆర్ రహదారి ని ర్మాణానికి రూ. 36,000 వేల కోట్లు,

రహదారులు లేని గ్రామీణ ప్రాంతా ల్లో కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు సిం గిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల ని ర్మాణం, అదే సమయంలో HAM ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్ల మం జూరుకు ఆమోదం లభించడంతో మరికొద్ది రోజుల్లోనే టెండర్ల ఆహ్వా నానికి అవకాశం లభించిందని ప్ర భుత్వం వెల్లడిస్తోంది.

వీటితో పాటు ప్రపంచంలోని పెట్టు బడిదారులు అంతా తెలంగాణ రా ష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదు పాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహ దారుల నిర్మాణంతో తెలంగాణ రా ష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమ లు పెద్ద సంఖ్యలో రానున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫ లితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుంది.

అదే విధంగా రూ. 8,000 వేల కోట్ల తోమన్ననూరు నుంచి శ్రీశైలం వర కు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారి డార్ కూడా పూర్తి కానుంది.దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచ ర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రూ. 20 వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందని చెబు తున్నారు.

నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్కతో పాటు నల్గొండ నియో జ కవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలి పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఈ పనులకు సంబంధించి ప్ర తి 15 రోజులకు ఒకసారి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిం చారు. నా రాజకీయ జీవితంలో ఒ క గొప్ప అవకాశాన్ని కల్పించిన అం దరికీ ధన్యవాదాలు అన్నారు ఈ సందర్భంగా మంత్రి.