Politicsతెలంగాణహైదరాబాద్

Big Breaking : బిగ్ బ్రేకింగ్, సీనియర్ ఎడిటర్ రా మచంద్రమూర్తి కీలక వ్యాఖ్య, తెలం గాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని ప రిశోధనలు 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరి శోధనలు జరుగాలని సీనియర్ సం పాదకులు రామచంద్రమూర్తి ఆకాం క్షించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను రాసుకునే సమయం ఆస న్నమైందని ఈ క్రమంలోనే కట్టా శేఖ ర్ రెడ్డి తెలంగాణ మూలలు పుస్త కంతో తెలుగుభాష, తెలంగాణ చ రిత్ర పరిశోధనపై లోతైన పరిశోధన చేశారని కొనియాడారు. తెలంగాణ చరిత్రపై మరిన్ని పరిశోధనలు రావా ల్సిన పరిస్థితిని కల్పించడంలో పు స్తక రచయిత విజయవంతమ య్యారని ప్రశంసించారు. తెలంగా ణ వాస్తవిక చరిత్రను ఆవి ష్కరిం చుకునే పరిశోధన మార్గంలో సీని యర్ సంపాదకులు, రచయిత కట్టా శేఖర్ రెడ్డి రచించిన ‘తెలంగాణ చ రిత్ర మూలాలు’ పుస్తకం దిక్సూచి వంటిదని సీనియర్ సంపాదకులు, రచయితలు, చరిత్ర పరిశోధకులు అభివర్ణించారు. పుస్తకంతో తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి,తెలుగు భాష, ఆంధ్ర భాష, చరిత్ర లు కొత్త మలుపులు తిరుగబోతున్నాయ న్నారు. ఆదివారం హైదరాబాద్ ర వీంద్ర భారతి వేదికగా ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కే రామ చంద్రమూ ర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి కా పీని నాగారం సర్పంచ్, పుస్తక ర చ యిత కట్టా శేఖర్‌రెడ్డి మామగారైన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి అం దించారు.

ఈ సందర్భంగా కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ చరిత్ర అంటేనే మా ర్పులు, కూర్పులతో కూడిందన్నా రు. దేశంలో విజేతలు చరిత్రను రా సుకున్న ఆనవాయితీ కొనసాగడం తో అసలు చరిత్ర ఏమిటన్నది ని త్య సత్యశోధనగా కొనసాగుతుం దన్నారు. తెలంగాణ చరిత్ర మూలా లు పుస్తకంతో తెలుగు రాష్ట్రాల చ రిత్ర, సంస్కృతి, తెలుగు భాష, ఆం ధ్ర భాష, చరిత్రలు కొత్త మలుపులు తిరుగబోతున్నాయని కీలక వ్యాఖ్య లు చేశారు. పుస్తకం లోని అంశాలు ప్రాచీన తెలంగాణ వైభవాన్ని ఘనం గా చాటే ప్రయత్నం చూస్తే కట్టా శేఖ ర్ రెడ్డిని కట్టర్ తెలంగాణవాదిగా చె ప్పవచ్చన్నారు. జాతీయ స్థాయిలో బ్రిటిష్ పాలకులు రాసిందే చరిత్రగా మిగిలి పోయిందని కే రామచంద్ర మూర్తి అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ఎస్ భావ జాల చొరవతో కొత్త జాతీ య చరిత్రను ప్రజల ముందుకు తె చ్చే ప్రయత్నం జరుగుతున్నదని చె ప్పారు. ఏ చరిత్ర కూడా శాశ్వతం కాదని, ఇది కూడా మార్పులకు లో నవ్వడం తథ్యమని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జీ జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ

తెలంగాణ చరిత్రను, భాష, సం స్కృతులను అణిచివేసే కుట్రలు ఉ మ్మడి రాష్ట్రంలో జరిగాయని మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి అన్నారు. అ యితే స్వరాష్ట్రం ఏర్పాటు పిదప మన చరిత్ర, భాషలను స్థిరీకరించు కునే ప్రయత్నాలు ఆశించిన స్థాయి లో జరుగలేదని విచారం వ్యక్తం చే శారు. కట్టాశేఖర్ రెడ్డి తెలంగాణ చ రిత్ర మూలాలు పుస్తకంతో తెలం గా ణ భాష, చరిత్ర పరిశోధనలపై గొ ప్ప ప్రయత్నం చేశారని అభినందిం చారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై ఆంధ్రావాళ్ల నుంచి ప్రతిస్పందనలు తప్పక వస్తాయన్నారు. చరిత్ర పరి శోధనలు ఎంత తవ్వితే ఎంత చిలి కితే అంతా మంచిదని చెబుతూ తె లంగాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరిశోధనలు జరుగాలన్నారు.

మరో సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర పు స్తక రచనతో రచయిత కట్టా శేఖర్ రెడ్డి ఆంధ్ర, తెలుగు, తెనుగు భాష ల మధ్య వైరుధ్యాలపై విస్త్రృత పరి శోధన చేశారని ప్రశంసించారు. పు స్తకం చదువుతుంటే థ్రిల్లర్ నవల ను, కాల్పనిక నవలను చదువుతు న్నట్టు ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. తెలంగాణ చరిత్రపై ప్రాం తీయ ఆధిపత్య శక్తుల ప్రభావం నుంచి స్వీయ అస్థిత్వం, ఆత్మగౌర వంతో కూడిన చరిత్రను ఆధారా లు, పరిశోధనలతో చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తెలుగు భా ష తెలంగాణకు చెందినదని త్రి లిం గ, తెనుగు, తెలంగాణ భావనను తొక్కిపెట్టేందుకు ఆంధ్ర భాష, సం స్కృతిని పైకి తెచ్చారని చెప్పే ప్రతి పాదనలను చేశారని తెలిపారు.

ఆంధ్ర పదాన్ని జాతి, సంస్కృతి, భాషావాచకంగా వాడుతున్నార న్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితు ల్లో తెలుగు మీద ప్రాంతీయ ఆధిప త్యం కోణం ఏమైనా ఉందా అనే ప రిశోధనతో కట్టా శేఖర్ రెడ్డి త్రిలింగ దేశం, తెనుంగు, తెలింగ, తెలంగా ణ ప్రతిపాదనలను చేసి తెలంగాణ, ఆంధ్ర చరిత్రలపై మరింత పరిశోధన చేయడంపై ఆసక్తిని పెంచేశారని అ భివర్ణించారు. నన్నయ్య పూర్వం వే దాలు, పురాణాలు వంటి వాటిలో మినహా ఆంధ్ర ప్రస్తావనపై లిఖిత ఆధారాలు లేవని, చరిత్ర వివాదాల న్నీ వర్తమాన అవసరాలుగా, రాష్ట్ర విభజన పిదప కూడా ఆధిపత్య భా వజాల, భాష సంఘర్షణలు కొనసా గుతుున్నాయన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఘం టా చక్రపాణి మాట్లాడుతూ భారత దేశ చరిత్రతో పాటు, ఆంధ్రులు, తె లంగాణ చరిత్ర కూడా వక్రీకరణల తో సాగాయని అన్నారు. ఈ పరి స్థి తులో తెలంగాణ చరిత్ర మూలాలు రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్రను తిరగరాసే, పునర్నిర్వచిం చే ప్రయత్నం చేశారని అభినందిం చారు. బ్రిటిషర్లు రాసిందే చరిత్ర అ న్నట్లుగా ఇప్పటిదాకా సాగిందని, ఇ ప్పుడు వేదాలు, ఇతిహాసాలు, పు రాణాల ప్రాతిపదికగా దేశ చరిత్రను సనాతన ధర్మం ప్రాతిపదికగా కొత్త గా రాసే దుర్మార్గ ప్రయత్నాలు సా గుతున్నాయని పేర్కొన్నారు.

దీంతో దేశంలోని భిన్నత్వం నశించి ఏకత్వం ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. హైందవత్వానికి అ తీతమైన చరిత్రను భారత చరిత్రగా చూడలేకపోతున్నారని ఆరోపించా రు. సింహాలు తమ చరిత్రను చెప్పు కోనంతవరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుందని ఘంటా చక్ర పాణి వ్యాఖ్యానించారు. అందుకే తె లంగాణ రాష్ట్రంలో మన చరిత్రను మనం చెప్పుకోవాలని, ఈ దిశగా ప్ర భుత్వం కూడా పరిశోధనలను ప్రో త్సహించాలని సూచించారు.

తెలంగాణ మీడియా అకాడమీ తొ లి చైర్మన్, సీనియర్ సంపాదకులు అల్లం నారాయణ మాట్లాడుతూ

ఉమ్మడి రాష్ట్రంలో భాష, సంస్కృ తుల అస్తిత్వం కోల్పోయిన తెలం గాణకు స్వరాష్ట్రంలో చరిత్ర నిర్మా ణం, భాషలపై జరుగాల్సిన పరిశో ధనలు జరుగలేదని సీనియర్ సం పాదకులు, ప్రెస్ అకాడమీ మాజీ చై ర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ చరిత్ర మూలాల రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర, భాషలపై ఆసక్తి కర చర్చను లేవనెత్తారని అభినం దించారు. తెలంగాణ భాష, చరిత్ర చర్చ జరిగిన ప్రతిసారి ఆంధ్ర ఆధిప త్యశక్తుల నుంచి ప్రతివాదన ఎదు రవుతుందన్నారు.

తెలంగాణ చరిత్ర, మూలాలు, తెలు గు భాషా తెలంగాణ చరిత్ర అను బంధాలను శాసనాలు, ఆధారాల తో ఒక కూర్పుగా తీసుకురావడం లో శేఖర్‌రెడ్డి సఫలీకృతులయ్యా రన్నారు. ఇదే శాశ్వతం కాదని మరి న్ని పరిశోధనలతో ఈ చరిత్ర మా రుతునే ఉంటుందని, తెలంగాణ ని ర్మాణాత్మక చరిత్రకు ఈ పుస్తకం దో హదం చేస్తుందన్నారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ మా జీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మా ట్లాడుతూ చరిత్రను ఎప్పుడూ ఎవ రూ పూర్తిగా రాయలేరని అన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలు కూడా ఆక్రమ ణలకు గురయ్యాయన్నారు. ఆంధ్ర ప్రాంతం వారు ఆది కవి నన్నయ్య కంటే ముందు తెలుగు లేదంటా రని, దానికి సమాధానంగా అంత కుముందే తెలంగాణలో తెలుగు, తె నుంగు భాషతో తెలంగాణ గొప్ప జ నపదంగా విలసిల్లిందని తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో కట్టా శే ఖర్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేశా రని కొనియాడారు.

సీనియర్ ఎడిటర్, సాక్షి ఈడి వర్ధెల్లి మురళి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను పునర్‌నిర్మించే ప్రయత్నం లో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరి త్ర మూలాలు పుస్తకంతో గొప్ప పరి శోధనాత్మక ప్రయత్నం చేశారన్నా రు. ఆంధ్ర, తెలుగు, తెలంగాణ చరి త్రలకు సంబంధించి తన రచనతో కొత్త చర్చను ప్రారంభించారని తెలి పారు. ఇరిగేషన్ అంశాలపై గతంలో ఆసక్తికర పుస్తకం రచించిన శేఖర్ రె డ్డికి పరిశోధన అలవాటుగా మార్చు కున్నారన్నారు. జాతీయ స్థాయిలో చరిత్రలో మార్పులకు దుర్మార్గ ప్ర యత్నాలతో నిజమైన చరిత్ర మ రుగున పడే ప్రమాదం ఉందన్నారు.

పుస్తక రచయిత కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా అంశంపై గత చరిత్రను అ న్వేషించే స్వీయ ఆస్తక్తి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తక రచన వై పు తనను నడిపించిందని చెప్పారు. తమిళ భాషకు ప్రాచీన హోదా అంశంతో తెలుగు భాషపై మూలాలపై ఆసక్తి పెరిగిందని తెలి పారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న తె లుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వ డాన్ని మద్రాసు హైకోర్టులో సవాల్ చేయడం కూడా తనను తెలుగు భాషా చరిత్రపై ఆసక్తిని పెంచింద న్నారు. తెలుగు మూలాలు పరిశో ధ న చేసే క్రమంలో రాజరాజచోళు డు ఆదికవి నన్నయ్యను మహాభార తాన్ని తెలుగులో రాయమని కోర డం ఆయన కూడా తెలుగులోనే రా స్తానని చెప్పారని అయితే అది కా స్తా అంధ్ర మహాభారతంగా మారిం దన్నారు.

దీంతో తెలుగు పదాన్ని తెలంగాణ చరిత్ర ను ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం చేశారన భావన తనలో బలపడింద ని చెప్పారు. తెలంగాణ చరిత్రను గుర్తించాల్సి వస్తుందన్న భయంతో నే తెలుగు, తెనుంగు పదాలు ఆంధ్ర పరి శోధకులకు మింగుడు పడనివి గా మారాయన్నారు. తెలుగు మూ లం తెనుగు అని స్థిరీకరించారని.. అంతకుముందు తెలుగు లేదా అ న్న ప్రశ్నతో తాను పరిశోధన చేసి పుస్త కాన్ని తెచ్చానని తెలిపారు. తెలుగు, తెలంగాణ లింక్ తో తన పరిశో ధనను కొనసాగించి చారిత్రక ఆధారాలు, శాసనాలతో తెలంగాణ చరిత్ర మూలాలు రచన చేశానని వి వరించారు. అయితే ఇది మాత్రమే తెలంగాణ చరిత్ర అని తాను నిర్ధా రించడం లేదని.. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగాల్సి ఉందని శేఖర్‌రెడ్డి అన్నారు.ఈ పుస్తకానికి ముందుమాట రాసి న కే శ్రీనివాస్ తదితరులు లేవనెత్తి న ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధా నం చెప్పే ప్రయత్నాలు చేస్తానన న్నారు.

దిశ ఎడిటర్ మార్కండేయులు మా ట్లాడుతూ తెలంగాణ మూలాలు చ రిత్ర పుస్తకంతో కట్టా శేఖర్‌రెడ్డి ఈ తరంలో తెలంగాణ చరిత్ర మూలా లపై ఆసక్తిని పెంచారన్నారు. సీని యర్ న్యూస్ ఎడిటర్ కోవెల సంతో ష్ కుమార్ పుస్తక పరిచయం, వం దన సమర్పణతో సమావేశం ముగి సింది.

Related Articles

Back to top button