–అత్యాచారా నిందితులకు సింహ స్వప్నంలా న్యాయమూర్తి రోజా రమణి
–సంవత్సర కాలంలో 19 మంది కామాందులకు కఠిన శిక్ష విధింపు
–నల్లగొండ ఫోక్సో కోర్టు మరో సంచలన తీర్పు
–మైనర్ బాలికపై లైంగిక దాడికి పా ల్పడ్డ నిందితునికి 21ఏళ్ళ జైలుశిక్ష
–బాధితురాలికి రూ. 10 లక్షలు న ష్టపరిహారం ఇవ్వాలని తీర్పు
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: మైనర్ బా లికపై లైంగిక దాడికి పాల్పడ్డ నింది తుడు దోమల రాములుకు సెక్షన్ 3 76 ప్రకారం 21 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధి స్తూ నల్లగొండ ఫోక్సో కోర్టు న్యా య మూర్తి రోజా రమణి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. 2018 వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధి లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాములు పై కేసు న మోదయింది. కేసును విచారించిన ఫోక్సొకోర్టు న్యాయమూర్తి రోజా ర మణి నిందితునికి జైలు శిక్ష, జరి మానా తో పాటు లీగల్ అథారిటీ ద్వారా బాధితురానికి రూ. పది లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదే శాలు జారీ చేసింది.
మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డ నిందితులకు ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి సింహ స్వప్నంలా మారారు. గత సంవత్స ర కాలంగా నల్లగొండ ఫోక్సో కోర్ట్
19 మంది కామాందులకు కఠిన కా రాగార శిక్ష విధించి బాధితులకు ఎ ప్పటికైనా న్యాయం కలుగుతుం ద ని కోర్టులపై విశ్వాసం కలిగేలా చే సింది. నల్లగొండ ఫోక్సోకోర్టు మె జిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండ జి ల్లా పోలీసులు పకడ్బందీ విచారణ జరిపి చార్జి షీటును దాఖలు చేస్తుం డడంతో నిందితులు శిక్షలు అనుభ విస్తున్నారు.
*అభినందించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్* ….ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారలు సేకరించి కో ర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పిం చి నిందితునికి శిక్ష పడే విధంగా చే సిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ పాం డురంగ రెడ్డి, యస్.ఐ సైదాబాబు, ప్రాసెక్యూషన్ కు సహకరించిన నల్ల గొండ డిఎస్పి కె.శివరాం రెడ్డి, శాలి గౌరారం సిఐ నాగరాజు, నార్కట్ పల్లి యస్ఐ రవి కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సి డి ఓ యాదయ్య, లైజ న్ అధికారులు, లీగల్ ఆఫీసర్, బరోసా సెంటర్ కె.కల్పన, పి.నరేం దర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.