Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోతీవ్ర చర్చనీయాంశ మైన పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవ హారం మళ్ళీ తెరపైకి వచ్చింది.బిఆ ర్ఎస్ నుంచి పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ అ సెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసు కున్నారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కు ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.
ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీలకు చేరిన 10 మంది ఎమ్మెల్యే లపై బీఆర్‌ఎస్ శాసనసభపక్షం అధి కారిక ఫిర్యాదు చేసిన విషయం తె లిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేర కు సదరు ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ కార్యాలయం ఆయా ఎమ్మె ల్యేలకు నోటీసులు పంపిస్తూ వివ రణ ఇవ్వాలని ఆదేశించింది.
నోటీసులలో, నిర్ణీత గడువులోగా తమ వాదనలు సమర్పించుకోవా లని స్పష్టంగా పేర్కొన్నట్లు సమా చారం. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం పార్టీ మార్పిడి కేసు లపై స్పీకర్ సమయపూర్వకంగా వి చారణ పూర్తి చేయాలని, ఆ క్రమం లో స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాలకు కీల కమని నిపుణులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల అర్హత రద్దుపై తుది నిర్ణ యం తీసుకుంటే, శాసనసభలో శక్తి సమీకరణాలపై ప్రభావం చూపే అవ కాశం ఉందని భావిస్తున్నారు. బీఆ ర్‌ఎస్ అయితే పార్టీని ద్రోహం చేసిన వారిని తప్పనిసరిగా అర్హత కోల్పో యేలా చేయాలని పట్టుదలగా ఉం దని సమాచారం. ఈ కేసుపై విచా రణ ముగిసే వరకు రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠ భ రితంగా మారనున్నాయని రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు.